Nagarjuna: ఈ సారి పండక్కి “నా సామిరంగ”.. మర్చిపోకండే..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రాబోతున్న సినిమాల్లో “నా సామిరంగ” కూడా ఒకటి. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా లో సెకండ్ హీరోగా అల్లరి నరేష్, మరో హీరోగా రాజ్ తరుణ్ కూడా నటించడం జరిగింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే నాగార్జున ఈ సారి కం బ్యాక్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. టీజర్ తో పాటు, సాంగ్స్ కూడా ఆడియన్స్ ని మెప్పించగా, తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయి సోషల్ మీడియా లో దూసుకుపోతుంది.

ఇక నా సామి రంగ ట్రైలర్ చూసాక ఒక్క ముక్కలో చెప్పాలంటే సంక్రాంతికి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఈ మూవీ సినిమా ‘పొరుంజం మరియం జొస్’ అనే మలయాళం మూవీకి రీమేక్ గా తెరకెక్కగా, ట్రైలర్ లో ఆ ఛాయలు పెద్దగా తెలియకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడని చూపొచ్చు. పైగా సంక్రాంతికి వస్తున్న సినిమా కావడంతో ట్రైలర్ లో విలేజ్ నేటివిటీ తో కూడిన పండగ వాతావరణాన్ని ఎక్కువగా చూపించారు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమావైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.

ఇక ట్రైలర్ లో కథ విషయానికి వస్తే కిష్టయ్య అంజి ఊళ్ళో బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటూ ఊళ్ళో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ క్రమంలో ఊళ్ళో జాతర టైం లో జరిగిన గొడవలో వీళ్ళిద్దరిపై కొందరు పగబడతారు. అప్పుడు ఇద్దరూ కలిసి వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు. మధ్యలో వరలక్ష్మి తో కిష్టయ్య గోలేంటి? అనేది సినిమాలో చూడాలి.

- Advertisement -

ఇక ట్రైలర్ టెక్నికల్ గా విజువల్స్ పరంగా బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఎంఎం కీరవాణి అందించిన బీజీఎమ్ చాలా బాగుంది. విజయ్ బిన్నీ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. మరి జనవరి 14న రిలీజ్ అవుతున్న నా సామి రంగ ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు