Bhrama yugam : ఎంత కంటెంట్ ఉన్నా ప్రమోషన్ చేయకపోతే ఎలా?

మలయాళ స్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటుడిగా పేరొందిన ఈయన ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోతారు. ఒక్క మళయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న మమ్ముట్టి, రీసెంట్ గా చేసిన సినిమాలు మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. లాస్ట్ ఇయర్ ఆయన నటించిన క్రిస్టోఫర్, ఏజెంట్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు మమ్ముట్టి.

మలయాళ దర్శకుడు రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా నటించిన సినిమా “భ్రమ యుగం”. థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళం పాన్ ఇండియా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ తెలిసేలా బ్లాక్ అండ్ వైట్ లో టీజర్ ని రిలీజ్ కూడా రిలీజ్ చేసారు. మరి సినిమా కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలాగానే రిలీజ్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. భ్రమ యుగం సినిమాని “నైట్ షిఫ్ట్ స్టూడియోస్”, వై నాట్ స్టూడియోస్ బ్యానర్ లో చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ కలిసి నిర్మించారు.

ఇక ఫిబ్రవరి 15న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అయితే మలయాళం వరకు మమ్ముటి సినిమా కాబట్టి లైట్ తీసుకున్నా, తెలుగులో మాత్రం మినిమం మార్కెటింగ్, ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేస్తే జనాలు ఎలా ఆదరిస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మమ్ముట్టి నటించిన పలు సినిమాలు మలయాళం లో బ్లాక్ బస్టర్ అవుతున్నా, తెలుగులోకొచ్చేసరికి ఆ సినిమాల్ని జనాలు అంతగా పట్టించుకోవడం లేదు. కానీ మమ్ముట్టి సినిమాల పైన పెట్టె డెడికేషన్ వేరే. ఆయన తెలుగులో చేసిన యాత్ర సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలిసిందే. అలాంటిది ఈ సినిమాని తెలుగులో డైరెక్ట్ ప్రోమోట్ చేయకుండా ఎన్ని పాటలు, ట్రైలర్లు రిలీజ్ చేసినా లాభం లేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు