Lifestyle: ఎవరినైనా ఓదార్చాలి అంటే ఈ పదాలను వాడండి… బెటర్ గా ఫీల్ అవుతారు

మన ఫ్రెండ్స్ లో, రిలేటివ్స్ లో, మనకు బాగా దగ్గరైన వారిలో ఎవరైనా బాధపడితే, ఏడిస్తే ఏం చేస్తాం? చాలామందికి అసలు అవతలి వ్యక్తిని ఎలా ఓదార్చాలో తెలియక అయోమయానికి గురవుతారు. కొంతమంది మాత్రం ఏదో ఒకటి చెప్పి ఓదారుస్తారు. ఆ ఓదార్చే క్రమంలోనే “ఇట్ విల్ బి ఆల్ రైట్” అనే ఫ్రేజ్ ను తరచుగా వాడతారు. కానీ ఇది అన్ని సందర్భాలకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పలేము. కొన్నిసార్లు అతిగా, ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. మరి ఇతరులను ఓదార్చడంలో సులభంగా, ఈజీగా ఉండే ఫ్రేజెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అయామ్ హియర్ ఫర్ యు
కొన్నిసార్లు బాధపడే వారికి వాళ్లు ఒంటరిగా లేరు అని తెలుసుకోవడం చాలా అవసరం. అలాంటి సమయంలో “అయామ్ హియర్ ఫర్ యు” అని మీరు చెప్పడం వాళ్లకు చాలా ఓదార్పునిస్తుంది. వారికి మీరు సపోర్ట్ చేస్తున్నారని, కష్ట సమయాల్లో మీరు వారికి సహాయం చేస్తారనే భరోసాను ఇస్తుంది.

2. యు ఆర్ స్ట్రాంగర్ దెన్ యు థింక్
మీరు ఇష్టపడే వారిలోని ఇన్నర్ స్ట్రెంత్ ను గుర్తు చేయడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఎవరైనా సరే కష్టం ఎదురైనప్పుడు వాళ్లు ఎంత స్ట్రాంగ్ అన్న విషయాన్ని మర్చిపోతారు. కాబట్టి “మీరు యు ఆర్ స్ట్రాంగర్ దెన్ యు థింక్” అని చెప్పారంటే వాళ్లలో కాన్ఫిడెన్స్, ధైర్యం పెరుగుతుంది.

- Advertisement -

3. టేక్ ఆల్ ది టైమ్ యూ నీడ్
ఎవరికైనా జీవితంలో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలినప్పుడు కోలుకోలేని అగాధంలో కూరుకుపోతారు. అలాంటి వారితో “టేక్ ఆల్ ది టైమ్ యూ నీడ్ ” అని చెప్పారంటే వాళ్ళ భుజాల నుంచి అతి పెద్ద బరువు దిగిపోయినట్టుగా అనిపిస్తుంది.

4. దిస్ టూ షల్ పాస్
సాధారణంగా ఒక కష్టం వచ్చిందంటే ఆ తర్వాత సంతోషం కూడా రావాల్సిందే. ఎవరైనా దారుణమైన కష్టాల్లో ఉన్నప్పుడు క్షణాలు యుగాళ్లా గడుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ కష్టం నుంచి ఎప్పుడు గట్టెక్కుతామా ? అని బాధ పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో “దిస్ టూ షల్ పాస్” అని చెప్తే వాళ్లకు ఓదార్పుగా ఉంటుంది.

5. యు డోంట్ హ్యావ్ టు గో త్రూ దిస్ అలోన్
స్ట్రగుల్స్ అనేవి జీవితంలో సర్వసాధారణం. కానీ అలాంటి సమయంలో చాలామంది ప్రపంచంలోని భారం అంతా తమ భుజాలపైనే మోస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు “యు డోంట్ హ్యావ్ టు గో త్రూ దిస్ అలోన్” అని చెప్పారంటే వాళ్లకి అవసరమైన సపోర్టును ఇవ్వడానికి మీరు తోడుగా ఉన్నారనే ధైర్యాన్నిస్తుంది.

6. ఇట్స్ ఓకే టు ఫీల్ వాట్ యు ఆర్ ఫీలింగ్
భావోద్వేగాల సుడిగుండంలో చిక్కుకుపోయి, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు అని ఫీలయ్యే వారితో “ఇట్స్ ఓకే టు ఫీల్ వాట్ యు ఆర్ ఫీలింగ్” అని చెప్పొచ్చు. దీనివల్ల వాళ్ళు ఎమోషన్స్ ను అణచివేయడానికి బదులుగా వాటిని యాక్సెప్ట్ చేసి ముందుకు సాగుతారు.

7. ఇంకా సమయాన్ని సందర్భాన్ని బట్టి వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ రియల్లీ సక్స్, యు ఆర్ ఇంపార్టెంట్, ఐ కాంట్ ఇమాజిన్ హౌ హార్డ్ దిస్ మస్ట్ బి ఫర్ యు, ఐ విష్ ఐ కుడ్ టేక్ అవే యువర్ పెయిన్ అనే ఫ్రేజెస్ ను వాడొచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు