Personality Development : ఎక్కువగా ఫ్రెండ్స్ ను సంపాదించుకోవాలంటే ఈ హ్యాబిట్స్ ను ఇప్పుడే వదిలేయండి

చిన్నప్పుడు తెలియకుండానే ఇతర చిన్న పిల్లలతో ఈజీగా కలిసిపోతాం. ఆడుకునే సమయంలో, స్కూల్లో చాలామంది పిల్లలతో స్నేహంగా మెలుగుతాం. దీంతో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద సమస్యగా మారదు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఫ్రెండ్స్ సర్కిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఉద్యోగం, వివాహం, పిల్లలు, కుటుంబ బాధ్యతలు పెరిగిపోవడంతో స్నేహితులు అన్నమాట దాదాపుగా మర్చిపోవాల్సి ఉంటుంది. పైగా ఫ్రెండ్స్ ను సంపాదించుకోవడం కూడా కష్టమవుతుంది. మరి ఏజ్ తో సంబంధం లేకుండా ఈజీగా కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి అంటే కొన్ని అలవాట్లను వదిలేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే…

1. అతిగా విమర్శించడం
పెద్దయ్యాక సాధారణంగానే నెగెటివిటీని భరించే ఓపిక తక్కువగా ఉంటుంది. ఎవరి సమస్యలు వాళ్లకు ఉంటాయి. అలాంటప్పుడు ఇతరుల తప్పులను ఎత్తి చూపే అలవాటు ఉన్న వ్యక్తులు కనిపిస్తే ఎవరైనా సరే దూరం పెట్టేస్తారు. పాజిటివ్ గా, ఆహ్లాదంగా ఉండే వ్యక్తులను కలవడానికి మాత్రమే ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మీలో ఈ అతిగా విమర్శించే అలవాటు ఉంటే పక్కన పెట్టేయండి.

2. టైం స్పెండ్ చేయకపోవడం
మీ లైఫ్ లో ఇంపార్టెంట్ అని భావించే వ్యక్తులకు టైం కేటాయించకపోవడం అనేది మంచి అలవాటు కాదు. ప్రేమలోనే కాదు ఫ్రెండ్షిప్ లోనూ అవతలి వ్యక్తితో టైం స్పెండ్ చేయడం బెటర్. ఎందుకంటే ఫ్రెండ్స్ తోనే మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే దీనివల్ల ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది.

- Advertisement -

3. గతమే సమస్య
ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. అయితే ఎప్పుడు చూసినా పాత రోజులు బాగుండేవి అంటూ గతంలో జీవించడం వల్ల కొత్త స్నేహితులను సంపాదించుకోవడం కష్టమవుతుంది. కాబట్టి గతాన్ని మెమొరీలో దాచేసుకుని, కొత్త ఫ్రెండ్షిప్ వైపు అడుగులు వేయండి.

4. వినడం
సాధారణంగా ఎవరైనా సరే తాము చెప్పింది శ్రద్ధగా వినే వాళ్ళను ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే అందరూ తమను అర్థం చేసుకునే వాళ్ళ కోసమే వెతుకుతారు. అలాగే మంచి లిజనల్ అయితే స్ట్రాంగ్, లాంగ్ ఫ్రెండ్షిప్ ను సంపాదించుకోవడం ఈజీ అవుతుంది. ఈ లక్షణం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ ను ఏర్పరచుకోవడానికి ఎవరైనా సరే రెడీగా ఉంటారు.

5. అప్రిషియేషన్స్
ఈ గజిబిజి జీవితంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎంత మంచి పని చేసినా అప్రిషియేట్ చేయడం కాదు కదా కనీసం పట్టించుకోము. కానీ మెచ్చుకోలు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తుంది. థాంక్స్, ఐ యాం అప్రిషియేటింగ్ యు అనే పదాల శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. ఈ రెండు పదాలు అవతలి వ్యక్తి ముఖంలో చిరునవ్వును తీసుకురావడంతో పాటు వాళ్ల డేను మరింత బ్రైట్ చేస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్ ను అప్రిషియేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.

6. స్నేహం అనేది రెండు వైపులా ఉండే మార్గం లాంటిది. కాబట్టి ప్రయత్నం రెండు వైపుల నుంచి ఉండాలి. అంటే కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించకుండా అవతలి వ్యక్తి పట్ల శ్రద్ధ వహించడం కూడా ముఖ్యమే. అలాగే అవతలి వ్యక్తి మీద ప్రతి దాని గురించి కంప్లైంట్ చేసే అలవాటు ఉన్న వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవ్వరూ ఆసక్తిని చూపించరు. మీలో గనక ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి. అప్పుడే ఎవరితోనైనా ఈజీగా ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు