Prabhas : డార్లింగ్ సినిమాకు హాలీవుడ్ సమస్యలు… థియేటర్లు దొరకట్లే!!

ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే ప్రభాస్ అని చిన్న పిల్లలు సైతం టక్కున చెప్పేస్తాడు. అలాంటి ప్రభాస్ సినిమాకు హాలీవుడ్ లో సమస్యలు ఎదురవుతున్నాయి. డార్లింగ్ కు హాలీవుడ్ లో థియేటర్లు దొరకక పోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ హాలీవుడ్ లో ప్రభాస్ కు ఈ సమస్య ఎదురు కావడానికి కారణం ఏంటి ? అంటే…

ప్రభాస్ కెరీర్లో రూపొందుతున్న అత్యంత కాస్ట్లీ ప్రాజెక్ట్ “కల్కి 2898 AD”. అంతర్జాతీయ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్ అవుతుంది అంటే మిగతా సినిమాలన్నీ పక్కకు తప్పుకోవాల్సిందే. అయితే హాలీవుడ్ లో ఈ మూవీకి గట్టి పోటీ ఎదురు కాబోతోంది. దీని కారణంగా “కల్కి”కి హాలీవుడ్ లో థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొంది. “కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్” అనే పాపులర్ ఇంగ్లీష్ మూవీ “కల్కి” మూవీకి మధ్య క్లాష్ ఏర్పడబోతోంది. “ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్” కూడా “కల్కి”తో పాటే మే 9న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ లోని IMAX తో పాటు ఇతర పెద్ద ఫార్మాట్ స్క్రీన్ లతో 2 వారాల పాటు “ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్” టీం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అదే రోజున రిలీజ్ అవుతున్న “కల్కి”కి ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తోంది.

నిజానికి IMAX లాంటి స్క్రీన్లలో మూవీ రిలీజ్ కాకపోవడం అంటే భారీగా కలెక్షన్లకు గండిపడినట్టే. మరి భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “కల్కి”, హాలీవుడ్ మూవీ “ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్”తో క్లాష్ కు రెడీ అవుతుందా? లేదంటే “కల్కి” రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేస్తారా? అనేది చూడాలి. ఒకవేళ క్లాష్ తప్పదు అనుకుంటే హాలీవుడ్ మూవీ కారణంగా “కల్కి”కి థియేటర్ల సమస్య తప్పదు. మరోవైపు “కల్కి” పోస్ట్ పోన్ కాబోతోందని జోరుగా రూమర్లు నడుస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇంకా వాయిదా వార్తలపై స్పందించలేదు. కాగా ప్రస్తుతం ప్రభాస్ సినిమాల షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడు. “కల్కి”లో తన పార్ట్ షూటింగ్ పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు డార్లింగ్ రెస్ట్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి “కల్కి” మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదా అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేదాకా ఆగాల్సిందే.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు