Bedurulanka2012: ఎట్టకేలకు హిట్టు కొట్టాడు.. అయినా సరే కిక్ రాలేదట?

Bedurulanka2012:

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న చిన్న హీరోల్లో కార్తికేయ ఒకరు. RX100తో ఎంట్రీ ఇచ్చిన ఇతను ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి ఆడియన్స్ ని మెప్పించాడు. అయితే లక్ కలిసి రాకో, లేక రాంగ్ టైం రిలీజ్ వల్లో కొన్ని మంచి సినిమాలు చేసినా ఇప్పటివరకు హిట్ మొహం చూడలేదు. మధ్యలో గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాల్లో విలన్ గా కూడా నటించి మెప్పించాడు. చివరగా రెండేళ్ల కిందట రాజా విక్రమార్కలో హీరోగా నటించి ప్లాప్ అందుకున్నాడు.

అయితే ఇన్నాళ్లకి ఈ హీరోకి బాక్స్ ఆఫీస్ కనికరించిందని చెప్పాలి. కార్తికేయ హీరోగా వచ్చిన తాజా చిత్రం బెదురులంక 2012 ఆగష్టు 25న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిత్రం మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుని మంచి కామెడీతో ప్రేక్షకులని అలరించింది. అంతే కాదు వారం తిరక్కుండానే బ్రేక్ ఈవెన్ సాధించి చాలా రోజులకు కార్తికేయకి క్లీన్ హిట్ దక్కింది.

అయితే ఇన్నాళ్లకు కెరీర్ లో రెండో హిట్ కొట్టినా కూడా, కార్తికేయ సంతృప్తిగా లేడని తెలుస్తుంది. దానికి మెయిన్ రీసన్ వారం పూర్తి కాగానే ఎక్కువ థియేటర్లలోంచి బెదురులంక ని తీసేయడం. సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన ఖుషి సినిమాకోసం బాగా ఆడుతున్న తమ సినిమాని తీసేశారని చిత్ర యూనిట్ ఫీల్ అవుతున్నారు. రెండోవారానికి వచ్చేసరికి 200 థియేటర్లను కూడా తమ సినిమాకు ఇవ్వకపోయేసరికి హిట్ కొట్టినా పెద్దగా లాభాలు ఆర్జించడానికి అవకాశం ఇవ్వలేదు. అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్లో పాల్గొంటున్నా జోష్ లో లేరు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు