Mahesh Babu Movie: పవన్‌ను గురూజీ ఇక వదలడా… OG కాకపోతే గుంటూరు కారం?

Mahesh Babu Movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అభిమానులు ముద్దుగా గురూజీ అని పిలుస్తుంటారు. అయితే గురూజీకి, పవన్ కళ్యాణ్‌కి మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. పవన్ చేసే ప్రతి సినిమాలో గురూజీ కాలు గానీ, వేలు గానీ పెడుతూనే ఉంటాడు. పవన్ నుంచి ఇటీవల వచ్చిన BRO సినిమాలో గురూజీ కాలు, వేలు మాత్రమే కాదు, ఏకంగా తల పెట్టి దూరిపోయాడు. అలా త్రివిక్రమ్ అంటే పవన్ ఫ్యాన్స్‌కు కొంత మేర కోపం ఉంటుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ OG సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో గురూజీ ఇన్వాల్వ్ అవ్వొద్దు అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అయినా, పవన్ ను గురూజీ వదలడం లేదు. OG కాకపోతే, తాను చేసే సినిమాలో పవన్ వాడేయడానికి రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను దించడానికి గురూజీ ట్రై చేస్తున్నాడట.

సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చే సందర్భం ఉంటుందట. అందు కోసం పవన్ కళ్యాణ్ ను తీసుకోవాలని గురూజీ డిసైడ్ అయ్యాడని టాక్. త్రివిక్రమ్ పిలిస్తే పవన్ ఎక్కడి వరకు అయిన వెళ్తాడు. కానీ, ఇక్కడ మహేష్ బాబు దీనికి ఒప్పుకుంటాడా? లేదా అనేది అసలైన సవాల్.

- Advertisement -

అయితే గతంలో త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన జల్సా సినిమాలో మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ అంటే బాగానే ఉంటుంది. కానీ, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా దీనికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే, గుంటూరు కారం మూవీ ఇంత లేట్ అవ్వడానికి కారణం, గురూజీ తన సినిమాలను వదిలి, పవన్ సినిమాలపై ఫోకస్ పెట్టడం అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతే కాదు, బహిరంగంగా కూడా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ సినిమాలో పవన్ ని లాగడం విమర్శలకు దారి తీస్తుందని చెప్పొచ్చు. అయితే, విమర్శలతో పాటు పవన్ ఫ్యాన్స్ కూడా సినిమాను ఓన్ చేసుకుంటారు. దీంతో మంచి ఫలితాలు కూడా రావొచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industire

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు