Bedurulanka2012: అసలు నమ్మకమే లేదు. కానీ వచ్చిన వాటిలో అదే బెటరు!

Bedurulanka2012:

టాలీవుడ్ లో ఈవారం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు తెలుగు సినిమాలు ఉండగా, ఒక డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ కి ముందు ఈ సినిమాల్లో వాటి వాటి రేంజ్ కి బట్టి ఆడియన్స్ లో అంచనాలు ఉండగా, రిలీజ్ అయ్యాక మాత్రం అవి రివర్స్ అయ్యాయి. ముఖ్యంగా టాక్ పరంగా ఏ సినిమా కూడా సరైన అంచనాలను అందుకోలేకపోయింది.

ఇందులో మొదటగా మలయాళం సినిమా కింగ్ అఫ్ కొత్త గురించి చెప్పాలి. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమాపై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి. పుష్ప తరహా లో ఒక రౌడీ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ట్రైలర్ ఉండడంతో ఆడియన్స్ ఓ రేంజ్ లో సినిమా ఉంటుందనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలన్నిటికి విరుద్ధంగా సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇక తాజాగా వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున కూడా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. గతంలో వచ్చిన ఏజెంట్, స్పై సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్ల వైపే వెళ్లడం లేదు. ఇక చివరగా కార్తికేయ నటించిన బెదురులంక 2012 కూడా ఇదే రోజు రిలీజ్ అయింది.

- Advertisement -

అయితే రిలీజ్ అయిన సినిమాల్లో అన్నిటికంటే తక్కువ బజ్ ఉంది ఈ సినిమాపైనే. ట్రైలర్ కూడా రొటీన్ కామెడీ కాన్సెప్ట్ తో ఉండడంతో దుల్కర్, వరుణ్ తేజ్ సినిమాల మధ్యలో బెదురులంకని అస్సలు పట్టించుకోరనుకున్నారు. కానీ తాజాగా ఈ రెండు సినిమాల కంటే బెదురులంకే చాలా బెటర్ అని టాక్ వస్తుంది. ఆ సినిమా కూడా కొత్తగా లేకపోయినా, కొద్దీ వరకు కామెడీ తో ప్రేక్షకులని అలరిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు