Bedurulanka2012: వరుణ్ తేజ్ తో పోటీ పడబోతున్న కార్తికేయ!

టాలెంటెడ్ హీరో కార్తికేయ ఎట్టకేలకు తన రాబోయే సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చాడు. రెండేళ్లకిందట రాజా విక్రమార్క సినిమాలో హీరోగా నటించిన కార్తికేయ మళ్ళీ సినిమా చేయలేదు. మధ్యలో అజిత్ వలిమై సినిమాలో విలన్ గా నటించినా అది పెద్దగా గుర్తింపునివ్వలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు “బెదురు లంక 2012″ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, పాటలు ఆకట్టుకోగా గత కొన్ని నెలలుగా ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ వస్తుంది.

తాజాగా “బెదురులంక 2012″ సినిమాను ఆగష్టు25 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అదే రోజు మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ “గాండీవధారి అర్జున” విడుదల అవుతుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. అంటే కార్తికేయ బెదురులంక సినిమాకు టఫ్ కాంపిటేషన్ ఉందని చెప్పవచ్చు. ఇక RX 100 తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని కార్తికేయ తన సక్సెస్ కోసం సాయశక్తులా కష్టపడుతున్నాడు. స్క్రిప్ట్ విషయంలో కూడా మంచి కథలే ఎంచుకుంటున్నాడు. కానీ లక్ కూడా కావాలిగా. అందుకే ఇప్పుడు రాబోయే సినిమాలపై చాలా శ్రద్ధ వహిస్తున్నాడు.

ఇక గాండీవదారి అర్జున చాలా రోజుల ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా, బెదురులంక ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ రిలీజ్ డేట్లు ఇలాగే ఉంటాయని చెప్పలేము. వీటి కంటే ముందు రిలీజ్ అవుతున్న కొన్ని పెద్ద సినిమాల ఫలితాలను బట్టి ఉంటుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు