Prabhas: సెంచరీ కొట్టేసేన “సలార్”.. ఇది మామూలు రచ్చ కాదు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యొక్క టీజర్ జులై 6న విడుదలై భారీ వ్యూస్ తో దూసుకుపోతూ కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన సలార్ టీజర్ తాజాగా మరో రికార్డు ను తన ఖాతాలో వేసుకుంది.

జులై 6న విడుదలైన సలార్ టీజర్ 24 గంటల్లో 83 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డు నమోదు చేయగా, తాజాగా 100 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ టార్గెట్ ని రీచ్ కావడానికి సలార్ కి కేవలం రెండు రోజులే టైమ్ పట్టింది. అటు లైక్స్ పరంగాను 1.9 మిలియన్ లైక్స్ దక్కించుకోగా అతి తర్వరలో 2 మిల్లియన్లను దాటనుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసింది.

ఈ విషయాన్ని హోంబలె ఫిల్మ్స్ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక ఆ పోస్ట్ లో సలార్ ట్రైలర్ అప్డేట్ గురించి కూడా చెప్పడం జరిగింది. క్యాలండర్ లో ఆగష్టు నెలను మార్క్ చేసి పెట్టుకోండి. భారతీయ వైభవాన్ని చాటి చెప్పే అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్ ను తీసుకొస్తున్నాం అని మెన్షన్ చేసారు. ఈ పోస్ట్ చూసిన డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. టీజర్ కే ఇంత హైప్ ఇస్తే ట్రైలర్ తో ఆ హైప్ ని ఇంకెంత రెట్టింపు చేస్తాడో అని అంటున్నారు. ఇక ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తైపోయిన “సలార్” సెప్టెంబర్ 28న బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేయడానికి వస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు