Nandamoori Balakrishna: వైరల్ అవుతున్న బాలయ్య ఫస్ట్ ఇంటర్వ్యూ పేపర్

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నటవారసుడిగా తండ్రి పోలికలతో పాటు, లక్షణాలను పుచ్చుకొని నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. నటసింహం గా నందమూరి అభిమానుల మన్ననలు పొందుతూ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు. రీసెంట్ గా వీర సింహ రెడ్డి తో మరో హిట్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీ గా ఉన్నాడు.

ఈ సినిమా కూడా బాలకృష్ణ స్టైల్ లోనే మాస్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ తాను హీరో అయ్యాక ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ పత్రిక పేపర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూ లో తన అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తన తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నటుడుగా ప్రత్యకమైన ఇమేజ్ సంపాదించుకోవాలని ఉంది అని పేర్కొన్నాడు. అంతే కాక తన తండ్రి పోలికలు వచ్చినంత మాత్రాన అందరు తన తండ్రి లాగే చూడాల్సిన పనిలేదని, తనలోని ప్రత్యేక నటుడున్నాడని, సమయం వచ్చినపుడు బయటపడుతుందని అన్నాడు. అయితే ఆ పేపర్ ఏ వార్తా పత్రికకు సంబంధించిందో మాత్రం తెలియదు.

ఇప్పుడు మాత్రం బాలయ్య ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ పేపర్ బాగా వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం అమెరికాకి ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్లిన బాలయ్య రాగానే భగవంత్ కేసరి సెట్స్ లో అడుగుపెడతాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు