Tollywood: ప్రసాద్స్ ఇట్స్ ఎన్ ఎమోషన్

ప్రసాద్స్ థియేటర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటినుంచో ఉన్న మల్టీఫ్లేక్స్ థియేటర్ కావడంతో ప్రసాద్స్ థియేటర్ కి ఒక బ్రాండ్ ఉంది. హైదరాబాద్ లో మార్నింగ్ షో మొదట అక్కడే పడుతుంది. ప్రసాద్స్ థియేటర్ కి చాలామంది సినీ ప్రముఖులు, సినీ ప్రేమికులు వస్తుంటారు.

ప్రసాద్స్ అంటే ఒక వైబ్, పొద్దునే స్నానం చేసి గుడికి వెళ్తే కొందరికి ఎంత ఆనందం వస్తుందో, ప్రసాద్స్ లో సినిమాకి వెళ్ళిన కూడా అదే ఫీల్, కాకపోతే కొన్ని సార్లు సినిమా రిజల్ట్స్ మనకు తలనొప్పి వస్తుంది అది వేరే విషయం. కానీ ప్రసాద్స్ మాత్రం సినిమా లవర్స్ కి ఫేవరేట్ స్పాట్ అని చెప్పొచ్చు. మంచి సినిమాటిక్ ఎక్సపీరియన్స్ కూడా అక్కడే లభిస్తుంది.

ఒకప్పుడు ప్రసాద్స్ లో సినిమా చూసి వచ్చిన వాళ్ళు రివ్యూ చెబుతుంటే, ఆ వీడియోస్ చూసి కూడా సినిమాకు వెళ్లేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం ఆ రివ్యూ పద్దతినే మార్చేసారు కొందరు ప్రేక్షకులు , కొన్ని యూట్యూబ్ చానెల్స్. సినిమా గురించి చెప్పడం తగ్గించేసి వాళ్ళ సొంత ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. వీటిని ఉపయోగించుకుని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కూడా గట్టిగ సంపాదించాయి.

- Advertisement -

ఒక సినిమా చూసి వచ్చాక ఆ సినిమా ఎలా ఉంది.? దర్శకుడు ఏమి చెప్పాలి అనుకున్నాడు తన సినిమాతో .? లేదంటే ప్రేక్షకుడిని ఎలా ఎంటర్టైన్ చేసాడు.? సినిమాటోగ్రఫీ ఎలా ఉంది .? మ్యూజిక్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అయింది .? డైలాగ్స్ ఎలా ఉన్నాయి .? ఈ సినిమాను ప్రేక్షకులు ఎందుకు చూడాలి .? లాంటి డిస్కషన్స్ ఏవి ఇప్పుడు ప్రసాద్స్ బయట రివ్యూస్ చెప్పే వీడియోస్ లో కనిపించవు.

ఇకపోతే రీసెంట్ గా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా గురించి ఒక వ్యక్తి చెప్పడం. అది కొంతమంది అభిమానులకు నచ్చకపోవడంతో ఆ వ్యక్తిపై దాడి చేశారు. ఆ సంఘటన తరువాత ప్రసాద్స్ కి మీడియాకి , రివ్యూస్ తీసుకునే యూట్యూబర్స్ అనుమతిలేకుండా చేసింది ప్రసాద్స్ యాజమాన్యం. ఒక రకంగా ఇది చాలా మంచి విషయమే అయినా , అక్కడ మీడియా , యూట్యూబర్స్ లేకపోవడం వలన ఎప్పుడు కళకళలాడే థియేటర్ ఇప్పుడు వెలవెలాడుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు