Krithi shetty : మళ్ళీ బిజీ అవుతున్న బేబమ్మ

ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయిపోయింది కృతి శెట్టి. హృతిక్ రోషన్ సూపర్ 30 సినిమాలో చైల్డ్ ఆర్టిస్ గా సినిమాల లోకి వచ్చిన కృతి, ఉప్పెన సినిమాతో మన టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాకే పెద్ద సక్సెస్ రావడం తో వరుస ఆఫర్ లతో బిజీ హీరోయిన్ మారింది.

అయితే ఉప్పెన తర్వాత కృతి.. శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించటం తో కృతి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ పోయింది. అప్పుడే బేబమ్మ కి ఎదురు దెబ్బ తగిలింది. శ్యాం సింగరాయ్ తరువాత చేసిన బంగార్రాజు ఒక మోస్తరు విజయం సాధించింది. అయితే ఆ తరువాత నుంచి చేసిన సినిమాలన్నీఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు.

కెరీర్ ఒక్కసారిగా సూపర్ హిట్ నుంచి మొదలయ్యి , అంతే సూపర్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అవకాశాలు కూడా తగ్గాయి. కథ లేకపోతే ఏ సినిమా ఆడదు అనే ప్రాక్టీకల్ విషయాల కన్నా సెంటిమెంట్స్ ని ఎక్కువ నమ్ముకునే మన తెలుగు ఇండస్ట్రీ, కృతి శెట్టిని ఒక్కసారిగా దూరం పెట్టింది.

- Advertisement -

అయితే ఇప్పుడు కృతి, నాగ చైతన్య తో కలిసి “కస్టడీ” అనే మూవీ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా మే 12న రిలీజ్ అవబోతుంది. కస్టడీ మూవీలో కృతి శెట్టి యాక్షన్ స్టంట్స్ కూడా చేసిందట. తెలుగు -తమిళం రెండు భాషల్లోనూ రాబోతున్న ఈ సినిమా పై బేబమ్మ చాలా ఆశలు పెట్టుకుంది.

అయితే కస్టడీ సినిమా తరువాత కృతి శెట్టి మళ్లీ బిజీ అవనుందని చెప్పొచ్చు. ఇప్పటికీ కార్తీ హీరోగా వస్తోన్న ఒక తమిళ్ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు లో మంచి సక్సెస్ ని చూసిన మన బేబమ్మ ఇప్పుడు తమిళ ఎంట్రీ ఇవ్వనుంది. మరి అక్కడ తన కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు