Ravi teja: శ్రీలీలకి ఎందుకింత క్రేజ్ ?

తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది శ్రీలీల. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాల్లో నటిస్తూ అందరిని ఆశ్చర్య పడేలా చేస్తుంది ఈ డాక్టర్ పిల్లా. రాఘవేంద్ర రావు సమర్పణలో, శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల తెలుగు లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించినంతగా ఆడకపోయినా, శ్రీలీలకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందం, అభినయంతో పాటు ఎక్స్ట్రాడినరీ డాన్స్ స్కిల్స్ ఉండడంతో వరుస ఆఫర్స్ కొట్టేస్తుంది ఈ ముద్దుగుమ్మ

పెళ్లి సందడి సినిమా తర్వాత శ్రీలీల మాస్ రాజా రవితేజ తో ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రవితేజ కెరీర్ లోనే మొదటి 100కోట్ల చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా ఇంత ఘన విజయం, సాధించటానికి కారణం ఏమైయుంటుంది అని ఎవరిని అడిగిన సమాధానంగా ముగ్గురు పేర్లు వినిపిస్తాయి. అవే రవి తేజ, శ్రీలీల మరియు భీం సిసిరోలియో .

అవును ధమాకా మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న రొటీన్ కథనే అయినా రవి తే , శ్రీలీల పెర్ఫామెన్స్ జనాల్ని థియేటర్ వరకి రప్పించాయి. రవి తేజ , శ్రీలీల డాన్స్ పెర్ఫామెన్స్ చూడటానికే రిపీటెడ్ ఆడియన్స్ వెళ్లారు అని చెప్పడం లో ఏమాత్రం సందేహం లేదు. ఇలా ధమాకా ఇచ్చిన సక్సెస్ తో శ్రీలీల తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

- Advertisement -

ఇప్పటికే శ్రీలీల, అనిల్ రావిపూడి బాలయ్య బాబు, మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. మరో పక్క పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. నితిన్, వక్కతం వంశీ కాంబినేషలో రాబోయే సినిమాలోను శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ అయిపోవస్తున్న రామ్ -బోయపాటి సినిమాలో కూడా శ్రీలీల నే హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తోన్న సినిమాలో కూడా శ్రీలీల నే హీరోయిన్. ఇలావరుస సినిమాలతో బిజీ గా ఉన్న శ్రీలీల ఇంకెన్ని సినిమాల్లో కనిపిస్తుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు