Megastar: మళ్ళీ ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న చిరు..!

వరుసగా సినిమాలు తీస్తూ యువ హీరోలతో పోటీ పడుతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా వేదాలం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి ఏ డైరెక్టర్ తో సినిమా చేయనున్నారన్న దానిపై గత కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బింబిసారతో హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్టకు మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారని వార్తలు రాగా అధికారికంగా ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు మెగా కాంపౌండ్ నుండి. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అజిత్ సూపర్ హిట్ సినిమా విశ్వాసం ను చిరంజీవి రీమేక్ చేయనున్నారని, ఆ సినిమాకు దర్శకుడు వీవీ వినాయక్ కు ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇదే కాకుండా, మమ్ముట్టి నటించిన మలయాళం సినిమా భీష్మ పర్వం రీమేక్ రైట్స్ కూడా చరణ్ కొన్నాడని, ఈ సినిమాను వినాయక్ చేత డైరెక్ట్ చేయించే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే చిరంజీవి తన సినిమాల గురించి టైటిల్ వంటివి లీక్ చేసేవారు. ఆ సందర్భాల్లో జరిగిన నష్టాన్ని గుర్తించి ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం. 

ఇదిలా ఉండగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో కూడా చిరంజీవి సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. గతంలో కృష్ణవంశీ ‘వందేమాతరం’ అనే కథను చిరంజీవికి వినిపించారని అప్పటి కమిట్మెంట్స్ వల్ల అది కార్యరూపం దాల్చలేదని తెలుస్తుంది. అయితే అదే కథను మళ్ళీ విన్న మెగాస్టార్ కథలో కొన్ని మార్పులు చేర్పులు సజెస్ట్ చేసారని సమాచారం. అయితే చిరంజీవి నెక్స్ట్ సినిమా కోసం ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వనున్నారు అన్నది తెలియాలంటే మెగా కాంపౌండ్ నుండి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు