Shaakuntalam: సమంతకి అల్ ది బెస్ట్ చెప్పిన విజయ్

సమంత , విజయ్ దేవరకొండ ల ఫ్రెండ్షిప్ గురించి అందరికి తెలిసందే. మహానటి సినిమా చేస్తున్న సమయంలో క్లోస్ అయిన వీళ్లిద్దరు చాల మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఎవరి సినిమా రిలీజ్ అయ్యిన ఒకరికొకరు అల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటారు. అయితే ఈ శుక్రవారం సమంత నటించిన “శాకుంతలం” సినిమా విడుదల అవుతుండంతో విజయ్ సమంతని ట్విట్టర్ ద్వారా విష్ చేసాడు.

సమంత , విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వం లో “ఖుషి” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ అవ్వగానే సమంత హెల్త్ కండిషన్ వాళ్ళ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. శాకుంతలం సినిమా కి సంబంధించి వర్క్స్ కూడా పెండింగ్ లో పడిపోయాయి. మరో పక్క యశోద సినిమా రిలీజ్ కి రెడీగా ఉండడం తో ఒక్కసారిగా అంత గందరగోళంగా మారిపోయింది. ఏది ఏమైనా సినిమా ఆగకూడదు అనే ఉద్దేశ్యం తో సమంత బెడ్ పై పడుకొని సెలైన్ ఎక్కుతుంటే యశోద సినిమాకి డబ్బింగ్ చెప్పేసింది. ఆమె కష్టానికి ఫలితంగా యశోద మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇంతలోనే శాకుంతలం మూవీ రిలీజ్ డేట్ ఇచ్ఛేసారు. అప్పటికే పూర్తిగా కోలుకొని సమంత , తన హెల్త్ కండిషన్ కూడా కేర్ చేయకుండా సినిమా కి సంబంధించి ప్రమోషన్స్ లో బిజీ అయింది. ముంబై , చెన్నై , హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్ లో శాకుంతలం సినిమాని ఆమె ప్రమోట్ చేసింది.

- Advertisement -

అయితే శాకుంతలం సినిమా 14న ప్రేక్షకుల ముందుకి వస్తోంది అయితే విజయ్ ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ.. సమ్.. నువ్వు ఫైటర్ వి సంవత్సరం నుంచి నువ్వు ఎంత కష్టపడుతున్నావో , మేము చూస్తూనే ఉన్నాం, ఇక నీకు రెస్ట్ అవసరం, ఇక బ్రేక్ తీసుకో శాకుంతలం మూవీ తప్పకుండ సక్సెస్ అవుతుంది అని విజయ్ ట్వీట్ చేసాడు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు