RRR : రాజమౌళి కి దక్కిన మరో అరుదైనా గౌరవం

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా రాజమౌళి కి మరో అరుదైనా గౌరవం దక్కింది. RRR సినిమా రిలీజ్ అయ్యి దాదాపు సంవత్సరం కావొస్తున్న ఇప్పటికి ఈ సినిమా గురించి ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భం లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆస్కార్ అవార్డులు ఇస్తున్నారంట, ఫలాన ఈ సినిమాకి వచ్చింది. ఆ.. సినిమాకి వచ్చింది అని మాట్లాడుకునే మనకి కూడా ఆస్కార్ వచ్చేలా చేసారు రాజమౌళి.

ఇప్పటికే పలు గౌరవ ప్రధానమైన అవార్డులు, రివార్డ్ లు అందుకున్న రాజమౌళికి గురువారం మరో అరుదైన గౌరవం దక్కింది. RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలమై, జేమ్స్ కామెరాన్, స్పిల్ బర్గ్ లాంటి చాలా మంది ఫిలిం మేకర్స్ రాజమౌళిని అభినందించిన విషయం తెలిసిందే. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఫిలిం మేకర్ ని టైం మ్యాగజైన్ అంత్యంత ప్రభావంతమైన వ్యక్తులలో ఒకడిగా ప్రకటించింది.

టైం మ్యాగజైన్ రిలీజ్ చేసిన 100 అత్యంత ప్రభావంతమైన వ్యక్తులలో మన దేశం నుంచి రాజమౌళికి చోటు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా డైరెక్టర్ కేటగిరిలో రాజమౌళి ఒక్కడికే ఈ అవకాశం దక్కడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వ కారణం. రాజమౌళి తో పాటు ఇండియా నుంచి షారుఖ్ ఖాన్ కి కూడా ఈ అరుదైన గౌరవం దక్కింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు