నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇమేజ్ కు సరిపడా మాస్ ఎలివేషన్స్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న తరుణంలో.. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసి 160 కోట్లు వసూళ్లు చేసి, పాండమిక్ తర్వాత ఇండస్ట్రీకి కొత్త జోష్ ఇచ్చింది.
దీని తర్వాత బాలయ్య, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీకి “అన్న గారు” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్, మైనింగ్ నేపథ్యంలో సాగే ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ గోపిచంద్ మలినేని.
బాలయ్య ఇమేజ్ కు సరిపడా మాస్ ఎలివేషన్స్ ఈ సినిమాలో కాస్త ఎక్కువ డోస్ లోనే ఉన్నట్టు సమాచారం. అలాగే అఖండ సినిమాను ఫాలో అవ్వమని డైరెక్టర్ కు బాలయ్య సూచించాడట. అఖండలో ఉన్న డివోషనల్ సన్నివేశాలను, “అన్న గారు” లోనూ పెట్టాలని కోరాడని తెలుస్తుంది. దీనికి గోపిచంద్ మలినేని అంగీకరించి, స్టోరీలో స్వల్ప మార్పులు చేసినట్టు ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రాజకీయ నేపథ్యాన్ని కూడా స్టోరీలో చేర్చినట్టు సమాచారం.
డివోషనల్, పాలిటిక్స్ తో పాటు మాస్ ఎలివేషన్స్ ఒకే సినిమాలో ఉంటే, నందమూరి అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఉండటం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగ ఈ మూవీ తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుంది. అలాగే దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ మెయిన్ రోల్స్ లో కనిపించబోతున్నారు.