థ్రిల్లర్ జోనర్ లో సినిమాని చేసేటప్పుడు కథలో అన్ ప్రెడిక్టబిలిటీ అనేది చాలా అవసరం , తరువాత ఏమి జరుగుతుందో తెలిసిపోతే సినిమాలో మజా ఉండదు. ఈ విషయంలో “నగరం” సినిమా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. ప్రతి పాత్రకి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది.
తన ఫస్ట్ సినిమాతోనే రైటింగ్ లో మాస్టర్ అనిపించుకున్నాడు ఈ “మాస్టర్” దర్శకుడు.
“నగరం” తరువాత చేసిన కార్తీ ” ఖైదీ” గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు, బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్స్ మోత మోగించింది ఈ సినిమా. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ హీరోగా “విక్రమ్” సినిమాని చేస్తున్నారు. కమల్ తో పాటుగా మరో ఇద్దరు వెర్సిటైల్ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో వీరితో పాటుగా తమిళ మరో స్టార్ నటుడు సూర్య కూడా ఉన్నాడని ఆ మధ్య ఒక గట్టి టాక్ వచ్చింది.
Read More: Tamannaah’s second innings : మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన తమన్నా ?
సూర్య విలక్షణమైన అతి తక్కువమంది నటులలో ఒకడు,కొన్ని సందర్భాలలో రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే అనిపించుకున్నాడు.సూర్య చేసిన ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంటుంది. సూర్య చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా మంచి పేరును తీసుకుని వచ్చాయి.
ఇంతకీ “విక్రమ్” సినిమాలో సూర్య , ఉన్నడా లేడా అనే సందేహాలకు సమాధానంగా దర్శకుడు లోకేష్ తమ “విక్రమ్” వరల్డ్ లో సూర్య కూడా ఒక భాగం అయ్యారని క్లారిటీ ఇచ్చి కన్ఫర్మ్ చేసాడు.
Read More: Raveena Tandon: బాలీవుడ్ ఓ కాపీ ఇండస్ట్రీ… రవీనా టాండన్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...