NTR : బుచ్చిబాబుకి హ్యాండిచ్చినట్టేనా?

‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. కాబట్టి… ఇప్పుడు అతని ఇమేజ్ ను బ్యాలన్స్ చేసే దర్శకులు, స్క్రిప్ట్ లు కావాలి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయ్యింది. ఫోటో షూట్ కూడా జరిగింది. మే 20న అప్డేట్లుగా వాటిని రిలీజ్ చేస్తారు. ఇక ఎన్టీఆర్ 31వ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టుని నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. నిజానికి ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ‘సలార్’ చేస్తున్నాడు.2023 కి కానీ ఖాళీ అవ్వడు. ఆ తర్వాత ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 3’ స్టార్ట్ చేసే ఉద్దేశంలో కూడా ఉన్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ఫలితం చూసాక వదిలేలా లేడు. మే 20నే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది.

ఈ క్రమంలో ఎన్టీఆర్ తో సినిమా ఫైనల్ అవుతుంది అనుకుని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న బుచ్చిబాబుకి నిరాశే ఎదురైంది. ‘ఉప్పెన’ టైములో ఎన్టీఆర్ కు ఎన్నో బిస్కట్లు వేసాడు బుచ్చిబాబు. కానీ అవి ఫలించలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ను వేరే పెద్ద హీరోతో అయినా చేయాలి లేదా వేరే స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని మిడ్ రేంజ్ హీరోతో అయినా ముందుకు వెళ్ళాలి. ఎన్టీఆర్ కోసం ఇంకో రెండేళ్లు వెయిట్ చేయడం అతనికి ఏమాత్రం మంచిది కాదు అనేది ఇన్సైడ్ టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు