Allu Arjun : టాప్ ప్లేస్ కు వచ్చేస్తాడా?

మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ ను బాగా ఓన్ చేసుకున్నారు మెగా అభిమానులు. ఇక పవన్ తర్వాత ఆ స్థానం ఎవ్వరిదీ అనే ప్రశ్నకి రాంచరణ్ ను చూపిస్తున్నారు. నిజానికి అప్పటివరకు ఆ స్థానంలో అల్లు అర్జున్ ఉండేవాడు. కానీ రాంచరణ్ కంటే అల్లు అర్జున్ బెస్ట్ పెర్ఫార్మర్ అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.

అతని స్టోరీ సెలక్షన్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. చరణ్ పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి రాజమౌళి అవసరం పడింది. కానీ అల్లు అర్జున్.. తన సుకుమార్ తోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పటి మెగా హీరోల గ్రాఫ్ ను బట్టి చూస్తే వచ్చే రెండేళ్ళలో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ కు వచ్చేస్తాడేమో అనిపిస్తుంది.

అందుకు కారణాలు లేకపోలేదు. రాజమౌళితో సినిమా చేశాక సక్సెస్ అందుకోవడం చరణ్ కు అంత ఈజీ టాస్క్ కాదు అని ‘ఆచార్య’ తో తేలిపోయింది. అతను ఎంపిక చేసుకున్న రెండు స్క్రిప్ట్ లు ఆశాజనకంగా లేవు. ఇక పవన్ కళ్యాణ్ లైనప్ లో హరీష్ శంకర్ ప్రాజెక్టు తప్ప మిగిలింది ఏదీ ఆకర్షించే విధంగా లేదు.

- Advertisement -

చిరంజీవి సినిమాల పై ఇప్పుడు జనాలకి ఇంట్రెస్ట్ లేనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ‘పుష్ప2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కనుక హిట్ అయ్యి తర్వాత మంచి మంచి ప్రాజెక్టుల్ని ఎంపిక చేసుకుని ముందుకు వెళ్ళాడు అంటే అల్లు అర్జున్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. టాలీవుడ్లో ఏ హీరో టచ్ చేయని రేంజ్ కు అతను వెళ్లిపోవడం ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు