Dil Raju : టికెట్ ధరలు పెంచకపోయినా..!

‘ఎఫ్3’ కి టికెట్ రేట్లు పెంచడం లేదు అని.. ప్రభుత్వానికి ఎటువంటి వినతి పత్రాలు రాయడం లేదని దిల్ రాజు చెప్పుకొచ్చారు.ఇప్పుడున్న నార్మల్ టికెట్ రేట్లకే చిత్రాన్ని విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘ఎఫ్2’ కి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. టికెట్ రేట్లనేవి పెంచకపోయినా నైజాంలో ఉన్న టికెట్ రేట్లు ఏమీ తక్కువ కాదు. మల్టీప్లెక్సుల్లో రూ.295, సింగిల్ స్క్రీన్స్ లో రూ.175 లుగా ఉన్నాయి. ఇవి కూడా తక్కువని ‘ఎఫ్3’ టీం అభిప్రాయం.

అయితే ఫిబ్రవరి ఎండింగ్ నుండీ ఏప్రిల్ ఎండింగ్ 12 వరకు 6 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో ‘ఎఫ్3’ చిత్రాన్ని చూడ్డానికి జనాలు థియేటర్లకు వచ్చేంత ఇంట్రెస్ట్ చూపిస్తారా అన్నది పెద్ద ప్రశ్న. ‘ఎఫ్2’ క్రేజ్ ఉంది కదా అని చాలా మందికి అనుమానం రావచ్చు కాకపోతే.. ‘ఎఫ్2’ హిట్ అవ్వడానికి చాలా ఫాక్టర్స్ ఉన్నాయి. ‘ఎఫ్2’ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా. ఆ టైంలో వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి.

వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్, సంక్రాంతి సీజన్, అన్నిటికి మించి ఆ టైములో రూ.138, రూ.150 వరకే మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లు ఉండేవి. సింగిల్ స్క్రీన్స్ లో అయితే రూ.100గా ఉండేవి. కాబట్టి ‘ఎఫ్2’ కి కలిసొచ్చింది. కానీ ‘ఎఫ్3’ కి దాదాపు రూ.300, మినిమమ్ రూ.200 టికెట్ రేట్లు పెట్టుకుని రావడం కష్టం. అనిల్ రావిపూడి పై జనాల్లో ఉన్న నమ్మకం ఏమాత్రం నిలబడుతుందో చూద్దాం..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు