Harish Shankar : మరో రీమేక్ కు శ్రీకారం..!

తెలుగులో ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. కథలు దొరక్కపోవడంతో డైరెక్టర్స్, కొత్త ప్రయోగాలు చేయకుండా, ఇది వరకే ఇతర భాషాల్లో ప్రేక్షకులు హిట్ చేసిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి నుండి, నితిన్, రామ్ పోతినేని తో పాటు ఇటీవల ఇండస్ట్రీకి వచ్చిన తేజ సజ్జ వంటి హీరోలు కూడా రీమేక్ సినిమాలకే ఓటేస్తున్నారు.

ఇక దర్శకుల్లో రీమేక్ కింగ్ అంటే హరీష్ శంకర్. తెలుగు సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న ఈ సమయంలో హరీష్ శంకర్, బాలీవుడ్ సినిమాలను తెలుగులోకి రీమేక్ చేసి అందులో భారీ మార్పులు చేసి, బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో “దబాంగ్” సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” గా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే తమిళ “జిగర్తాండ”ను తెలుగులో వరుణ్ తేజ్ తో “గద్దల కొండ గణేష్” గా రీమేక్ చేసి మెగా హీరోకు హిట్ అందించాడు.

హరీష్.. మరోసారి బాలీవుడ్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడట. అజయ్ దేవగన్, ఇలియాన జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ’’రైడ్’’ ను తెలుగులో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇప్పటికే హరీష్, “రైడ్” నిర్మాత పనోరమా స్టూడియోస్ కుమార్ మంగత్ పాఠక్ ను కలిసి తెలుగు రీమేక్ పై చర్చించారట. తెలుగులో కూడా ఆయనే నిర్మించడానికి ఆసక్తి ఉన్నాడని సమాచారం.

- Advertisement -

1980లో లక్నో నగరంలో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ స్టోరీలో హరీష్ శంకర్ ఏమైనా మార్పులు చేస్తాడా..? లేదా అలాగే చేస్తాడో చూడాలి.

కాగ హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “భవదీయుడు భగత్ సింగ్” చేస్తున్నాడు. పొలిటికల్, వరుస సినిమాలతో పవన్ బిజీ గా ఉండటంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ ఈ రీమేక్ పై చర్చలు జరుపుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు