Anasuya : పవన్‌ కళ్యాణ్‌ కోసం ఆ పనులు చేసేందుకు అనసూయ రెడీ !

Anasuya : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్ల కంటే ఈ మధ్యకాలంలో యాంకర్లకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. సుమ, శ్రీముఖి, అనసూయ భరద్వాజ్ , విష్ణు ప్రియ ఇలా చెప్పుకుంటూ పోతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. ఎవరి టాలెంట్ వారిదే అన్నట్లుగా ప్రతి ఒక్క యాంకర్ కు ప్రత్యేక టాలెంట్ ఉంటోంది. ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి కచ్చితంగా ఉంటుంది.

అయితే మన తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. సోషల్ మీడియాలో మొదలుపెట్టుకొని… రియల్ లైఫ్ వరకు అనసూయ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన కెరీర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్రలు చేసిన యాంకర్ అనసూయ.. జబర్దస్త్ షో తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. దాదాపు పది సంవత్సరాలపాటు జబర్దస్త్ షోలో యాంకర్ గా పనిచేసింది అనసూయ భరద్వాజ్. అనంతరం మళ్లీ సినిమా కెరీర్ ప్రారంభించింది. దానికి తగ్గట్టుగానే తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ అనసూయకు మంచి ఛాన్సులు వచ్చాయి.

అడవి శేషు, అల్లు అర్జున్ , రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా హీరోయిన్ అనసూయ భరద్వాజ్ నటించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సినిమాలో అదిరిపోయే పాత్ర చేసింది అనసూయ. ఇప్పుడు పుష్ప రెండవ భాగంలో కూడా అనసూయ నటిస్తోంది. అయితే తాజాగా అనసూయ భరద్వాజ్ షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం ఏపీలో పార్లమెంటుతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే ఈ ఎన్నికలలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయాలని అనసూయ భరద్వాజ్ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు ఇప్పటికే నాగబాబు కూడా అనసూయను హెల్ప్ అడిగారట. దీంతో వెంటనే అనసూయ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లోనే సోషల్ మీడియా వేదికగా లేదా నేరుగా ఏపీకి వెళ్లి పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయనున్నారట అనసూయ భరద్వాజ. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

నిజంగానే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అనసూయ భరద్వాజ్ ప్రచారం చేస్తే ఓట్లు బాగానే రాలుతాయని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందం మరియు అభినయానికి ఓటర్లందరూ ఫిదా అయిపోతారని కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు. ఇది ఇలా ఉండగా అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ యూత్ ఆకట్టుకుంటుంది అనసూయ భరద్వాజ. అంతేకాదు అప్పుడప్పుడు ఆంటీ అంటూ అనసూయ భరద్వాజ్ ను నెటిజన్స్ ఆడుకుంటారన్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు