Yash : హద్దులు దాటుతున్న “టాక్సిక్” బడ్జెట్… యష్ ఒక్కడే ఆ భారాన్ని మోయగలడా?

Yash : కేజిఎఫ్ మూవీ తర్వాత కన్నడ హీరో యష్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ అదే ఇప్పుడు ఈ హీరోకు భారంగా మారబోతోందా అనిపిస్తోంది. ఆయన నెక్స్ట్ మూవీకి నిర్మాతలు పెడుతున్న ఖర్చే ఇలా అనిపించడానికి కారణం. మరి టాక్సిక్ బడ్జెట్ ఎంత? దాని తగ్గ అంచనాలను అందుకోవడం యష్ కు సాధ్యమయ్యే పనేనా? అంటే…

కేజిఎఫ్ కంటే డబుల్ బడ్జెట్ తో టాక్సిక్…

కన్నడ స్టార్ యష్ హీరోగా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఇప్పటికే టాక్సిక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ యష్ సోదరిగా కనిపించబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఇక హీరోయిన్ గా ఇప్పటికే సాయి పల్లవి ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. కానీ నటీనటులపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి యష్ 100 కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే యష్ కు ఉన్న పాన్ ఇండియా మార్కెట్ ను నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే టాక్సిక్ మూవీ బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదని తెలుస్తోంది. ఏకంగా 300 కోట్ల బడ్జెట్ తో టాక్సిక్ మూవీని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. నిజానికి ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్, కేజిఎఫ్ 2 రెండు సినిమాలకు కలిపి 200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ ఇప్పుడేమో టాక్సిక్ విషయంలో యష్ క్రేజ్ పెరిగింది అంటూ, పాన్ ఇండియా స్పాన్ అంటూ ఏకంగా 300 కోట్లు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. కానీ దీనివల్ల యష్ పై పెద్ద భారమే పడబోతోంది.

ఈ భారాన్ని యష్ మోయగలడా?

యష్ కెరీర్ కేజిఎఫ్ ముందు వరకు ఒక లెక్క తర్వాత ఒక లెక్క అన్నట్టుగా మారింది. కానీ ఆ సక్సెస్ కారణంగానే ఇప్పటిదాకా కన్నడ పరిశ్రమ కనీవినీ ఎరగనంత బడ్జెట్ ను టాక్సిక్ కోసం ఖర్చు పెట్టబోతున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దర్శకులపై ఇంత బడ్జెట్ పెట్టినా వర్కౌట్ అవుతుందనే ధైర్యం ఉంటుంది. కానీ టాక్సిక్ మూవీకి అలాంటి సినిమా అనుభవం ఉన్న సీనియర్ డైరెక్టర్ పని చేయట్లేదు. కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఆమె ఇప్పటిదాకా తీసింది ఒక్క సినిమా మాత్రమే కావడంతో అసలు టాక్సిక్ ను ఎంతవరకు పర్ఫెక్ట్ మేకింగ్, టేకింగ్ తో ఆమె రూపొందిస్తుంది ? అనేది ఒక అనుమానం. ఇలాంటి దర్శకురాలిని నమ్మి ఏకంగా 300 కోట్లు పెడితే ఏమాత్రం తేడా కొట్టినా నిర్మాతలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం. పైగా కేజిఎఫ్ తర్వాత యష్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇప్పుడు భారమంతా కేజిఎఫ్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన యష్ పైనే పడుతుంది. సినిమాలో ఎంతమంది నటీనటులు ఉన్నప్పటికీ మూవీ ని బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యతను యష్ తన భుజానికి ఎత్తుకోక తప్పదు. మరి ఆయన ఎంతవరకు ఈ భారాన్ని మోయగలడు? మూవీని సక్సెస్ వైపు ఒక్కడే నడిపించగలడా? కథలో అంత సత్తా ఉందా? అనేది మరో అనుమానం. మరి టాక్సిక్ మూవీకి ఈ భారీ బడ్జెట్ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు