Jaragandi Song : హైప్ మొత్తం చెడ దొబ్బారు కదరా… “జరగండి” సాంగ్ కు దారుణమైన రెస్పాన్స్

Jaragandi Song : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్’. చాలా రోజులుగా ఈ మూవీ అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసి ట్రీట్ ఇచ్చారు. మార్చి 27న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి “జరగండి” అనే సాంగ్ (Jaragandi Song) రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ మూవీకి ఫస్ట్ 24 అవర్స్ లో వచ్చిన రెస్పాన్స్ చూసి ఉసూరుమంటున్నారు మెగా ఫ్యాన్స్. పాటతో ఇప్పటిదాకా ఉన్న బజ్ ను మొత్తం చెడగొట్టారని టాక్ నడుస్తోంది. మరి ఇంతకీ 24 అవర్స్ లో “జరగండి” పాటకు వచ్చిన వ్యూస్ ఎన్ని? అంటే…

హైప్ అంతా చెడ దొబ్బారు కదరా…

గేమ్ ఛేంజర్ మూవీ నుంచి “జరగండి” అనే సాంగ్ ను రిలీజ్ చేస్తామని గత ఐదు నెలలుగా ఊరిస్తూ వచ్చారు మేకర్స్. కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుండడంతో మెగా ఫాన్స్ సహనం కోల్పోయి సోషల్ మీడియా వేదికగా తిట్ల పురాణం అందుకున్నారు. అప్పుడు కూడా గేమ్ ఛేంజర్ మేకర్స్ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. గతేడాది దీపావళికి వస్తుంది అనుకున్న “జరగండి” సాంగ్ ఇప్పుడు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయింది. ఒక పాటను రిలీజ్ చేయడానికి ఐదు నెలలు సమయం తీసుకున్నారు అంటూ మండిపడ్డారు అభిమానులు. సరే ఎలాగైతేనేం సాంగ్ వచ్చేసింది. చాలా రోజులుగా ఊరించి ఊరించి చివరకు ఊడిపడిన ఈ సాంగ్ చివరకు తుస్సుమనిపించి, మెగా ఫాన్స్ గాలి తీసేసింది. ప్రభుదేవా వంటి కొరియోగ్రాఫర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేసినప్పటికీ రామ్ చరణ్, కియారా స్టెప్పులు ఆకట్టుకోలేకపోయాయి. ఇక తమన్ రొటీన్ మ్యూజిక్ కాపీ అంటూ ఇచ్చిపడేసారు నెటిజెన్లు. మొత్తానికి ఫస్ట్ సాంగ్ ఏమంతగా బాగాలేదన్న విషయాన్ని తొలి 24 గంటల్లో వచ్చిన వ్యూస్ ద్వారా తేల్చేశారు ఆడియన్స్. మార్చి 27న ఉదయం 9 గంటలకు రిలీజ్ అయిన ఈ పాటకు మార్చి 28 ఉదయం సరిగ్గా అదే సమయానికి కేవలం 4.5 మిలియన్ల వ్యూసే రావడం గమనార్హం. దీంతో సోషల్ మీడియా వేదికగా మళ్లీ మెగా అభిమానులలో అసహనం మొదలైంది. ఇప్పటిదాకా ఈ మూవీకి ఉన్న హైప్ మొత్తాన్ని “జరగండి” సాంగ్ తో చెడ దొబ్బారు కదరా అని మండిపడుతున్నారు.

“జరగండి”కి వ్యూస్ తక్కువ… కారణాలు ఎక్కువ… “జరగండి” పాటకు హిందీ, తమిళ భాషల్లో వచ్చిన దారుణమైన వ్యూస్ గురించి చెప్పుకోకపోవడమే బెటర్. ఒక భాషలో 3 లక్షలు, మరొక భాషలో 5 లక్షల వ్యూస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ రేంజ్ కు ఇంత తక్కువ వ్యూస్ రావడం అనేది సినిమా గురించి కొత్త అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. పాట రిలీజ్ కాగానే తమన్ ఎక్కడ నుంచి కాపీ కొట్టాడు అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టేశారు. ఇక ఇన్నాళ్లు శంకర్ సినిమా అనగానే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ హైలెట్ గా ఉండేది. దీంతో గేమ్ ఛేంజర్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మారడం అనేదే బిగ్గెస్ట్ మైనస్ కాబోతోందా అనే అనుమానాలు ఉండేవి. అనుకున్నట్టుగానే ఈ పాటకు ఊహించిన ఆదరణ మాత్రం దక్కలేదు. సాధారణంగానే శంకర్ సినిమాల్లో ఉండే భారీతనం, ఖర్చు ఈ పాటలో కనిపించింది. కానీ “జరగండి” సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ కూడా కంగు తినాల్సి వచ్చింది. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ పాట లీక్ కావడం కూడా ఈ పాటకు ఇంత దారుణమైన వ్యూస్ రావడానికి కారణమై ఉండొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు