Allu Arjun : అంతకు మించి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలోని డైలాగ్స్, డ్యాన్స్, పాటలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అల్లు అర్జున్ కు బిగ్ హిట్ అందించింది. కాగా దీనికి కొనసాగింపుగా పుష్ప-2 ను సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప-2కు మరింత క్రేజ్ తీసుకురావడానికి చిత్ర యూనిట్ చూస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో స్టార్ నటీ నటులను ఎంపిక చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మలయాళ నటుడు ఫహద్ ఫజిల్, రష్మిక మందన్నా, అనసూయ ఈ చిత్రంలో ఉన్నారు. అలాగే సమంత చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. సమంత అందానికి తోడు.. డ్యాన్స్, పాట, మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇప్పుడు పుష్ప 2 లో కూడా అలాంటి ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు సుకుమార్. పుష్ప పార్ట్ 1 కంటే పార్ట్ 2 లో స్పెషల్ సాంగ్ ను మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారని సమాచారం. అందుకోసం బాలీవుడ్ బ్యూటీ రంగంలోకి దించుతున్నారని టాక్. బాలీవుడ్ సీనియర్ ఐటమ్ హీరోయిన్ మలైకా అరోరా. ఏది ఏమైనా పుష్పా-2 సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని అనుకోవచ్చు. మొత్తంగా పుష్పా-2 కోసం ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు