God Father : ఇక నుంచి వ‌రుస‌గా

మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన ‘లూసీఫ‌ర్’ రీమెక్‌ను తెలుగులో ‘గాడ్‌ఫాద‌ర్’ టైటిల్‌తో రీమెక్ చేసిన విష‌యం విధిత‌మే. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 05న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ త‌రుణంలో ఈ సినిమాకు ప్ర‌మోష‌న్స్‌ గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించే ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ చేసిన పాత్ర‌ను తెలుగులో స‌ల్మాన్ ఖాన్ పోషించ‌నున్నారు. అయితే ఈ చిత్రాన్ని తొలుత మ‌ల‌యాళం త‌ప్ప మిగిలిన క‌న్న‌డ‌, తమిళ‌, హిందీలో విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ కేవ‌లం తెలుగు, హిందీలోనే విడుద‌ల చేస్తున్నారు. గాడ్ ఫాద‌ర్‌లో స‌ల్మాన్‌ఖాన్ చిరంజీవి స్పెష‌ల్ సాంగ్ ఉంది. ఇటీవ‌లే ఈ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేయ‌గా.. దానికి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ సినిమా నుంచి ఫుల్‌వీడియో సాంగ్ కాకుండా ఆడియో సాంగ్ విడుద‌ల చేయ‌డంపై అభిమానులు కోపం క‌ట్ట‌లు తెచ్చుకుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఫుల్ వీడియో సాంగ్ అంటూ ఆడియోను విడుద‌ల చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

చిరు, స‌ల్లూ భాయ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ చూసి ఎంజాయ్ చేయాల‌నుకున్న అభిమానుల‌కు గాడ్ ఫాద‌ర్ తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇదిలా ఉండ‌గా ఈరోజు నుంచి వ‌రుస‌గా మూడు పాట‌లు విడుద‌ల చేస్తున్నారు. ఇక అనంత‌పురం బ‌స్టాండ్ ప‌క్క కాలేజీ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 25న హిందీలో ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు క‌న్‌ఫ‌ర్మ్ అయింది. తెలుగు శాటిలైట్ మిన‌హా మిగ‌తా మార్కెటింగ్ మొత్తం పూర్తి అయిన‌ట్టు స‌మాచారం. గాడ్ ఫాద‌ర్ సినిమాలో చిరంజీవి త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఖైదీ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ త‌ర‌హా ఖైదీ, ఖైదీ నంబ‌ర్ 786, గ్యాంగ్ లీడ‌ర్‌, రౌడీ అల్లుడు, అల్లుడా మ‌జాకా, ఖైదీ నెంబ‌ర్ 150 వంటి సినిమాలు స‌క్సెస్ సాధించాయి. ఆ సెంటిమెంట్ ప్ర‌కారం గాడ్ ఫాద‌ర్ కూడా సూప‌ర్ హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో అభిమానులు ఉన్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు