HBD Alia Bhatt: తెలుగులో ఆలియా భట్ ఫేవరెట్ హీరో ఎవరంటే.. చెర్రీ,తారక్ మాత్రం కాదండోయ్..!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ భట్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఆలియా భట్ ఈరోజు 28వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్ , నటి సోనీ రజ్ధాన్ కుమార్తె అయిన ఈమె ఐదేళ్ల వయసులోనే సంఘర్ష్ అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలు పెట్టింది.. బాలనటిగా అదొక్క చిత్రంలో మాత్రమే కనిపించిన ఆలియా ఆ తర్వాత మళ్లీ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించలేదు..

హీరోయిన్గా కెరియర్..
తర్వాత 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..ఈ సినిమా హిట్ అవడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.. దీంతో ఈమె కెరియర్ ప్రారంభమైన కొన్ని సంవత్సరాల లోనే టాప్ హీరోయిన్గా ఎదిగి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. మరోవైపు కొందరి హీరోయిన్ల లాగా కేవలం కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా ప్రయోగాత్మక చిత్రాలలో కూడా నటిస్తూ తన కెరియర్ను మరింత ముందుకు తీసుకెళ్తుంది ఆలియా భట్.. ఈ క్రమంలోనే హైవే, రాజీ, గంగూబాయ్ కథియావాడి వంటి చిత్రాలు ఈమెకు మరింత మంచి పేరు తీసుకొచ్చాయి.

అలియా భట్ తెలుగు ఎంట్రీ..
ఇదిలా ఉండగా ఇప్పటికే అలియా భట్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు కూడా లభించింది.. దీంతో ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని చెప్పవచ్చు.. ఇక ఈ సినిమాలో అలియా భట్ సీత పాత్రలో రామ్ చరణ్ సరసన నటించి అందరిని ఆకట్టుకుంది.. అలాగే ఎన్టీఆర్ తో కూడా వచ్చిన సన్నివేశాలలో ఆలియా తన నటనతో తనను తాను ప్రూవ్ చేసుకుంది.. అంతే కాదు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పోటీపడి నటించిన ఈమె తన అద్భుతమైన నటనతో మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించింది అలా తెలుగు వారికి దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ..

- Advertisement -

అలియా భట్ ఫేవరెట్ హీరో ..
ఇదిలా ఉండగా తాజాగా తెలుగులో ఈమె ఫేవరెట్ హీరో ఎవరో తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అలియా భట్ కి చాలా ఇష్టమట ..ఈ విషయాన్ని ఈమె గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.. ఇకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి నటించింది కానీ ప్రభాస్ అంటేనే తనకు ఇష్టమని చెప్పేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. అటు ఎన్టీఆర్ ఇటు రాంచరణ్ అభిమానులు మాత్రం నిరాశపడుతున్నారని చెప్పవచ్చు.. మరి అలియా భట్ కోరిక మేరకు ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం వస్తుందో లేదో చూడాలి.. ఇక ఈరోజు ఈమె పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు అలియా భట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు