Jyothika: చెన్నైకి రాకుండా ముఖం చాటేస్తున్న జ్యోతిక.. ఆ గొడవ లేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళ్లో ఆయనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతకుమించి ఉందనడం లో సందేహం లేదు.. ఎందుకంటే కోలీవుడ్లో ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా కూడా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి.. ప్రస్తుతం సూర్య సినిమాల విషయానికి వస్తే.. ఈయన చేతిలో కంగువా, వాడీ వసూల్ వంటి సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు.. మరొకవైపు ఈయన భార్య ప్రముఖ హీరోయిన్ జ్యోతిక కూడా వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే.. నిర్మాతగా కూడా మంచి ఫామ్ లో ఉంది..

ముంబైకి మకాం మార్చిన సూర్య – జ్యోతిక :
ప్రస్తుతం ఈ జంట ముంబైలో సెటిల్ అయిన విషయం తెలిసిందే.. అక్కడే ఒక ఇల్లును కొనుక్కొని పిల్లలతో కలిసి ఉంటున్నారు..

తండ్రితో గొడవలు..
ఇదిలా ఉండగా సూర్య కుటుంబం చెన్నై కాదని ముంబైలో మకాం పెట్టడానికి కారణం సూర్య తండ్రి శివకుమార్ అని.. అటు సూర్యకి ఆయన తండ్రి శివకుమార్ కి మధ్య మనస్పర్ధలు రావడమే వీరు ముంబై లో ఉండడానికి కారణం అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఈ విషయం గురించి చెప్పకుండా సూర్య తమ కుటుంబంతో సహా ముంబైలో ఉండడానికి కారణం తమ పిల్లలని, వారి చదువుల కోసమే ఇక్కడ ఉండాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.. అయితే ఎప్పుడైతే ఈ జంట ముంబైకి వెళ్ళిందో ఇక అప్పటినుంచి సూర్య మాత్రమే చెన్నైకి వస్తూ తన సినిమా షూటింగ్లను పూర్తి చేసుకుంటున్నారు..

- Advertisement -

చెన్నైకి ముఖం చాటే వేసిన జ్యోతిక..
కానీ జ్యోతిక మాత్రం ఒక్కసారి కూడా తన అత్తమామల ఇంటికి రాలేదు.. ఈమధ్య ఆమె సోదరి.. వారి ఇంటికి వెళ్లి ఏదో ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చినట్లు సమాచారం.. అప్పుడు కూడా జ్యోతిక చెన్నై రావడానికి ఇష్టం చూపలేదని సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సూర్య కూడా భార్య ఇష్టాన్ని కాదనకుండా..ఆమెను బలవంతం పెట్టడం లేదని సమాచారం.. దీంతో జ్యోతిక కూడా చెన్నై ముఖం చూడడం లేదనే వార్తలు వస్తున్నాయి.. ఇక ఎలాగో జ్యోతిక బిజీగా మారింది.. హిందీ, మలయాళం, తమిళ్ సినిమాలంటూ వరుసగా సినిమాలు చేస్తూనే మరొక పక్క ఫిట్నెస్ పై దృష్టిపెడుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అందుకే ఇప్పుడప్పుడే ఈమె చెన్నై ముఖం చూడదు అని చెప్పుకొస్తున్నారు.. మరి సోదరి ఇంటి ఫంక్షన్ కైనా వస్తుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే అత్తమామలతో గొడవ కారణంగానే ఈమె చెన్నైకి రావడం లేదా లేక వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల చెన్నైకి రావడం లేదా అన్న అనుమానాలపై క్లారిటీ రాలేదు. మరి ఎప్పటికి ఈ విషయాలపై క్లారిటీ వస్తుందో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు