Regina: ఎంగేజ్మెంట్ అంటూ పోస్ట్ చేసిన రెజీనా.. అసలు విషయం ఏమిటంటే..?

టాలీవుడ్లో యంగ్ బ్యూటీగా పేరు పొందిన రెజీనా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మొదట తమిళంలో తన కెరియర్ ను ప్రారంభించి.. తెలుగులో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది..SMS సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా తన మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం, రొటీన్ లవ్ స్టోరీ ,పవర్ ,రారా కృష్ణయ్య , శౌర్యం, సౌఖ్యం వంటి తదితర చిత్రాలలో నటించింది. ఇటీవల కాలంలో ఈమెకు అవకాశాలు తగ్గడంతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తోంది.

త్వరలో రెజీనా పెళ్లి..
ఇటీవలే హీరోయిన్ రెజీనా పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ..అందుకు కారణం ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ పలు రకాల వార్తలు వినిపించడమే.. ఒక బిజినెస్ మాన్ ను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యిందని.. ఈ నెలలో ఈమె వివాహ వేడుక ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి.. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ గత కొద్దిరోజులుగా ఈ విషయమైతే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది..

టాలీవుడ్ హీరోలతో ఎఫైర్..
అంతేకాకుండా గతంలో ఒక మెగా హీరోని కూడా లవ్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి.. ఆయన ఎవరో కాదు సాయి దుర్గ తేజ్.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , పిల్ల నువ్వు లేని జీవితం వంటి సినిమాలు ఈయనతో కలిసి చేసింది రెజీనా.. ఇక ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నారని.. లావణ్య లాగే ఈమె కూడా మెగా కోడలు కాబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.. కానీ అందులో ఏమాత్రం నిజం లేకపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తో కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించడంతో ఇటీవలే సందీప్ కిషన్ కూడా తామిద్దరం మంచి స్నేహితులమంటూ క్లారిటీ ఇచ్చారు..

- Advertisement -

కౌంట్ డౌన్ స్టార్ట్..
అదే విధంగా రెజీనా పోలింగ్ ఫర్ ఎంగేజ్మెంట్ అంటూ తన సోషల్ మీడియాలో అభిమానులను , ఆడియన్స్ ను ఉద్దేశించి ఒక పోస్ట్ షేర్ చేసింది.అలాగే కొన్ని స్టన్నింగ్ ఫోటోలను పంచుకుంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈ పోస్టు తన నిశ్చితార్థాన్ని తెలియజేసేదా.. లేకపోతే ఏంటనే విషయం పైన అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు.. ముఖ్యంగా తాను పెట్టిన క్యాప్షన్ లో ఎంగేజ్మెంట్ అనే పదం ఉండడంతో అందరూ కూడా ఆమె పెళ్లి గురించే అయ్యుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం రెజీనా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక రెజీనా విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఈమధ్య సినిమాలలో అవకాశాలు లేకపోయేసరికి వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతోంది.. ఈ క్రమంలోనే నివేదా థామస్ తో కలిసి షాకిని డాకిని అనే వెబ్ సిరీస్ చేసిన ఈమె త్వరలోనే సినిమాలలో నటించడానికి సిద్ధమవుతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు