Alia Bhatt: తెలుగు సినిమాతో భారీ క్రేజ్.. సంపాదన తెలిస్తే షాక్..!

Alia Bhatt

బాలీవుడ్ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు అలియా భట్. కోస్టార్ రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న ఈమె పెళ్లయినా కూడా సినిమాలలో జోరు మాత్రం తగ్గించలేదని చెప్పాలి.. 2012 సంవత్సరంలో మల్టీ స్టారర్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో నటనరంగంలోకి అడుగుపెట్టిన ఈమె మొదటి సినిమాతోనే తన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా సత్తా చాటిన అలియా తెలుగు సినిమాలతో కూడా భారీగా పాపులారిటీ దక్కించుకుందని చెప్పవచ్చు..

అలియా భట్ కెరియర్ లోనే 2022వ సంవత్సరం బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు.. తన మొదటి సినిమా తర్వాత అలియా భట్ చాలా హిట్ సినిమాలలో 2022 లోనే నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది.. ఈమె కెరీర్ లో రాజీ, గంగూబాయి కతియావాడి, రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని వంటి సినిమాలు పేరు తెచ్చి పెట్టాయి. ఇకపోతే రామ్ చరణ్ పక్కన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తెలుగు సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది..

ఈమె వ్యక్తిగత జీవితం.. సంపాదించిన ఆస్తుల విషయానికి వస్తే.. అలాగే కోస్టార్ రణబీర్ కపూర్ ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈమె అదే ఏడాది రాహాకపూర్ కు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .10కోట్ల పైగా పారితోషకం తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. 2018లో లండన్ లోని కోవెంట్ గార్డెన్ లో రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసి తన కలను నెరవేర్చుకుంది. లండన్ లో అత్యంత ధనవంతులు నివసించే నగరాలలో ఒకటిగా కోవెంట్ గార్డెన్ పేరు దక్కించుకుంది. అలాగే 2020లో బాంద్రా లో వాస్తు పాలీ హిల్స్ కాంప్లెక్స్ లోని ఐదవ అంతస్తు లో రూ.40 కోట్లు విలువైన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసింది.

- Advertisement -

అంతేకాదు తన సోదరి నివాసం ఉండే జుహు ఏరియాలో కూడా మరో ఇల్లు కొనుగోలు చేసింది ఆలియా భట్. ఇక 2020లో Ed -a-Mumma పేరిట ఒక దుస్తుల బ్రాండ్ ను కూడా స్థాపించింది. ఈ కంపెనీ విలువ సుమారుగా రూ .150 కోట్ల పై మాటే.. అంతేకాదు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ లో దాదాపు 51 %షేర్లకు ఆలియా భట్ దుస్తుల బ్రాండ్తో జాయింట్ వెంచర్ పై సంతకం చేసింది. అలాగే ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ పేరుతో 2019లోనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించింది. వీటితోపాటు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఈమె సొంతం.ఇక మొత్తం మీద రూ.600 కోట్లకు పైగా సంపాదించినట్లు సమాచారం.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు