Guntur Kaaram : ఓటిటిలో వస్తేగానీ వీళ్ళకు అర్థం కాలేదు సార్

Guntur Kaaram

సినిమాల విషయంలో కొన్నిసార్లు జనాలు ఇచ్చే తీర్పు విచిత్రంగా ఉంటుంది. బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న సినిమా అట్టర్ ప్లాప్ కావచ్చు. అసలు ఆడుతుందా అనుకున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవచ్చు. మూవీ రిజల్ట్ అనేది ఆడియన్స్ మూడ్ పై ఆధారపడి ఉంటుంది. తాజాగా “గుంటూరు కారం” మూవీ విషయంలో ఇలాగే జరిగింది. ఓటిటిలో వచ్చేదాకా ఈ మూవీ విలువ ఏంటో జనాలకు అర్థం కాలేదు. సంక్రాంతికి సందడి చేసిన సినిమాల రిజల్ట్ థియేటర్లలో ఒకలా ఉంటే, ఓటీటిలో తారుమారు కావడం విశేషం.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకు పోటీగా ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ “హనుమాన్” రిలీజ్ అయింది. ఆ తర్వాత రోజు అంటే జనవరి 13న వెంకటేష్ “సైంధవ్”, జనవరి 14న నాగార్జున హీరోగా నటించిన “నా సామి రంగ” మూవీ రిలీజ్ అయ్యాయి. ఇందులో “గుంటూరు కారం” సినిమాకు దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో గురూజీ మార్క్ మిస్ అయ్యిందంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ స్వయంగా కంప్లైంట్ చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. దీంతోపాటు అప్పటికే “హనుమాన్” అనే చిన్న సినిమా విషయంలో గొడవలు “గుంటూరు కారం” మూవీ రిజల్ట్ పై దారుణమైన ఎఫెక్ట్ చూపించాయి. వాస్తవానికి భారీ అంచనాలున్న సంక్రాంతి సినిమా “గుంటూరు కారం” మాత్రమే.

కానీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. కొన్ని చోట్ల అయితే కనీసం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా రీచ్ కాలేదు. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది వెంకటేష్ “సైంధవ్” మూవీ గురించి. వెంకీ కెరీర్ లో రూపొందిన 75వ స్పెషల్ మూవీ అన్న కనికరం కూడా లేకుండా రిజెక్ట్ చేసి పారేశారు జనాలు. ఇక సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో “హనుమాన్” మూవీ అనూహ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా, “నా సామి రంగ” మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి నిర్మాతలను సంతోష పెట్టింది.

- Advertisement -

అయితే తాజాగా “గుంటూరు కారం” మూవీ ఓటిటిలోకి రావడంతో ఈ సినిమాను వీక్షించిన ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంది. థియేటర్లలో ఈ మూవీకి నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. కానీ ఓటిటిలో మాత్రం మంచి ఆదరణ దక్కుతోంది. దీంతో ఓటీటీలో వస్తే గాని వీళ్లకు “గుంటూరు కారం” మూవీ విలువ అర్థం కాలేదు సార్ అంటూ త్రివిక్రమ్ పై సానుభూతిని చూపిస్తున్నారు. పైగా సంక్రాంతికి విడుదలైన సినిమాలను ప్రస్తావిస్తూ వాటిలో ఏది బెటర్ అనే విషయాన్ని కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

“గుంటూరు కారం” మూవీ ఇంట్రో నుంచి క్లైమాక్స్ వరకు రిపీట్ వర్తి మూవీ అని, “హనుమాన్” క్లైమాక్స్ తప్ప ఏం లేదని, “సైంధవ్”లో జాన్ విక్ స్టైల్ తప్ప చెప్పుకోవడానికి ఏం లేదని, చివరగా “నా సామి రంగ”లో నాగార్జున, ఆషిక రంగనాథ్ మధ్య కెమిస్ట్రీ తప్ప చూడడానికి ఏం లేదంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి “గుంటూరు కారం” మూవీనే ఓటిటి విన్నర్ అంటున్నారు. కానీ థియేటర్లలో లైట్ తీసుకుని, ఓటిటిలో ఆదరించడం వల్ల ఉపయోగం ఏముంది? అదే థియేటర్లలో ఇలాంటి రెస్పాన్స్ వచ్చి ఉంటే కలెక్షన్ల పరంగా “గుంటూరు కారం” దుమ్మురేపేది. త్రివిక్రమ్ బ్యాడ్ లక్ అంతే!

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు