Yatra 2 Movie Review and Rating: యాత్ర 2 మూవీ రివ్యూ

About the movie
సంక్రాంతి సీజన్లో పండుగ వాతావరణాన్ని తలపించే సినిమాలు రావడం ఎంత సహజమో, ఎన్నికల టైంలో రాజకీయ నేపధ్యం కలిగిన సినిమాలు రావడం కూడా అంతే సహజం. అది ప్రేక్షకులకి కూడా తెలుసు. ఇప్పుడు మనం రెండో అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎన్నికల టైంలో కొంతమంది దర్శకులు తాము అభిమానించే నాయకుల కోసం సినిమాలు తీస్తుంటారు. సినిమా ద్వారా ఎంత ప్రచారమైనా చేసుకోవచ్చు. కాబట్టి ఎన్నికల టైంలో వచ్చే ఇలాంటి సినిమాలు కొన్ని రాజకీయ పార్టీలకి మైలేజ్ చేకూరుస్తాయి అనేది కొందరి నమ్మకం. అందులో భాగంగానే 2019 ఎన్నికల టైంలో ‘యాత్ర’ సినిమాని విడుదల చేసి వైసీపీ పార్టీకి మైలేజ్ చేకూరేలా చేశాను అని దర్శకుడు మహి.వి.రాఘవ్ అనుకున్నాడు. కొంతమంది ప్రేక్షకులు కూడా దానికి ఏకీభవించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. ఇది చాలా మందికి తెలీని నిజం. 2024 లో కూడా ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ‘యాత్ర 2 ‘ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మహి వి రాఘవ్. మరి ఈ సినిమా వైసీపీ పార్టీకి మళ్ళీ మైలేజ్ చేకూర్చేలా ఉందా? లేదా? తెలుసుకుందాం రండి….

కథ :

‘యాత్ర’ సినిమా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర, ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు. 2004 లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం. దీనినే ప్రధానంగా ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు. అయితే ఈ ‘యాత్ర 2 ‘ లో… వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత అతని కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రోగ్రెస్ పార్టీ (కాం*స్ పార్టీ)లో చోటు చేసుకున్న పెను మార్పులు.. అలాగే వై.ఎస్.జగన్ పై జరిగిన ఐటీ రైడ్స్, అతను అరెస్ట్ అవ్వడం.. ఇలాంటి ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో 2019లో అతను తన పార్టీని ఎలా గెలిపించుకున్నాడు అనే అంశాలను.. తన కోణంలో తెలియజెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్.

- Advertisement -

విశ్లేషణ :

ఏ వ్యక్తి బయోపిక్కు తీసినా.. ఆ వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను ఆధారం చేసుకుని తీస్తేనే ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ‘మహానటి’ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. లేదు కేవలం భజన కోసమే తీయాలి అనుకుంటే ప్రేక్షకులు తిరస్కరించడం ఖాయం. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ దీనికి ఎగ్జాంపుల్. అయితే మహి వి రాఘవ్ ‘యాత్ర’ ని చాలా సెన్సిబిలిటీస్ యాడ్ చేసి కాంట్రోవర్సీలకి ఎక్కడా తావివ్వకుండా తీశాడు. అయితే ‘యాత్ర 2 ‘ కి వచ్చేసరికి అతని కూడా భజన బాట పట్టాడు. 2009 నుండి 2014 ఎన్నికల టైం వరకు జగన్ ఎదుర్కొన్న పరిస్థితులు.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అతను గెలవడం అనే జర్నీ చూపించడంలో తప్పు లేదు.

కానీ అతన్ని ఓ ‘దేవుని బిడ్డ’ గా చూపించే ప్రయత్నమే జనాలకి చిరాకు తెప్పిస్తుంది. జగన్ జీవితంలో ఎన్ని కాంట్రోవర్సీలు ఉన్నాయో అందరికీ తెలుసు. కానీ మహి వి రాఘవ కోణంలో చూడటం అందరికీ నచ్చదు. అయినప్పటికీ సంభాణలు మాత్రం బాగున్నాయి. అతని టేకింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్ అంతగా మెప్పించదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వంటివి బాగున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ‘యాత్ర 2 ‘ లో జగన్ సోదరి షర్మిల ప్రస్తావన తీసుకురాలేదు. అసలు ఆమె పాత్రే కనిపించదు. అలాగే 2014 ఎన్నికల్లో టీ*పీ గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా ముఖ్య పాత్ర పోషించాడు. ఆ టాపిక్ ను కూడా ‘యాత్ర 2 ‘ లో పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు. అసలు పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఇందులో లేదు. ఇవన్నీ రోజూ న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి, గంటలు గంటలు లైవ్ న్యూస్ ఛానల్స్ వీక్షించే వాళ్ళకి తెలియనివి కావు.

అయితే సినిమాని సినిమాగా చూడాలి అనుకునేవాళ్లు రాజ్ కుమార్ హిరాని తీసిన ‘సంజు’ లో నిజాలు ఎక్కువగా లేకపోయినా ఆదరించారు. ‘యాత్ర 2 ‘ విషయంలో కూడా కొంతమంది అలాగే ఫీలవ్వొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే … జగన్ పాత్రలో జీవా బాగానే నటించాడు. జగన్ నడక, చేతులు ఊపడం వంటివి ఎలా ఉంటాయో మీమ్స్ ద్వారా మాత్రం చాలా మందికి తెలుసు అనే చెప్పాలి. జగన్ పాత్రలోకి జీవా పరకాయ ప్రవేశం చేసేసాడు అనే చెప్పాలి. కాకపోతే డబ్బింగ్ కొన్ని చోట్ల తేడా కొట్టింది. ఆశ్రిత వేముగంటి విజయమ్మ పాత్రలో బాగా నటించింది. జగన్ భార్య భారతి పాత్రలో కేతిక నారాయణన్ చక్కగా నటించింది. ఈమెకు పెద్దగా డైలాగులు లేకపోయినా లుక్స్ తో ఆకట్టుకుంది. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సీనియర్ నాయకులు పాత్రలో శుభలేఖ సుధాకర్ వంటి వారు కూడా బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్ :

నటీనటుల పెర్ఫార్మన్స్
ఫస్ట్ హాఫ్
డైలాగ్స్
నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్
సాగదీత
ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
జనాలకి తెలిసిన అంశాలు కప్పిపుచ్చడం

చివరిగా..
‘యాత్ర 2’ పెద్దగా ఎమోషనల్ కనెక్ట్ లేని భజన సినిమా. టార్గెటెడ్ ఆడియన్స్ కూడా ఈ రేంజ్ సాగదీత భరించడం కష్టమే

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు