Gopi Chand: మైత్రీకి ఇచ్చిన మాట… గోపిచంద్‌కి వర్కౌట్ అయిందే..!

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో… గోపిచంద్ మలినేని దర్శకత్వంలో... మాస్ మహారాజా రవితేజ హీరోగా ఓ సినిమా వస్తుంది అంటూ ఇటీవల ఓ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఫోటోషూట్ కూడా చేశారు. కానీ, సడన్ గా ఈ మూవీ రద్దు అయినట్టు వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ సమస్యలు.. హీరో డేట్స్… హీరోయిన్ దొరకకపోవడం.. ఇలా పలు కారణాల వల్ల సినిమా రద్దు అయిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కారణం ఏదైనా, రవితేజకు మంచి హిట్స్ ఇచ్చిన గోపిచంద్ తో ఇప్పుడు సినిమా లేదు అనేది మాత్రం నిజం.

అయితే గోపిచంద్ – రవితేజ సినిమా రద్దు అయినా, గోపిచంద్ కథతో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేయడానికి మాత్రం రెడీ గా ఉన్నారు. రవితేజ ప్లేస్ లో మరో సీనియర్ హీరోను ఇన్ని రోజులు వెతికారు. రవితేజ తప్పుకోవడంతో, ఆ ప్లేస్ లో బాలీవుడ్ గానీ, కోలీవుడ్ నుంచి గానీ, ఓ సీనియర్ హీరోను తీసుకోవాలని మైత్రీ వారు సెర్చ్ చేశారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం… ఈ ప్రాజెక్ట్ కు ఓ స్టార్ హీరో సెట్ అయ్యాడట.

అయన ఎవరో కాదు.. సంక్రాంతికి తునీవు (తెలుగులో తెగింపు)తో హిట్ కొట్టిన అజిత్ కుమార్. కొన్ని రోజుల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ కి ఓ మాట ఇచ్చారట అజిత్. త్వరలోనే మైత్రీ బ్యానర్ లో సినిమా చేస్తానని ప్రొడ్యూసర్లకు చెప్పారట. అప్పుడు ఇచ్చిన మాటను మైత్రీ ప్రొడ్యూసర్లు.. అజిత్ ముందు ఇప్పుడు పెట్టారట. అజిత్ మాట ఇచ్చాడు కాబట్టి.. వెంటనే గోపిచంద్ తో సినిమా చేస్తానని అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాక్. ఇలా మైత్రీకి ఇచ్చిన మాట… ఇప్పుడు గోపిచంద్ కు వర్కౌట్ కాబోతుంది. ఈ సినిమా కానీ, హిట్ అయితే.. గోపిచంద్ కు తమిళతో పాటు పాన్ ఇండియా వైడ్ మంచి పేరు రావడం గ్యారంటీ.

- Advertisement -

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు