Jabardast Punch Prasad: రీ ఎంట్రీ ఇచ్చిన పంచ్ ప్రసాద్.. వద్దన్నా వినకుండా..!

బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన జబర్దస్త్ లోకి రీ యంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే రెస్ట్ లో ఉండాలని ఇప్పుడే నటనకు వెళ్లవద్దని డాక్టర్లు చెప్పినా సరే వినకుండా శ్రీ దేవీ డ్రామా కంపెనీ షోలోకి రీయంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అసలు విషయానికి గల కారణాలను చెబుతూ అందరి ముందు ఎమోషనల్ అయ్యారు పంచ్ ప్రసాద్. జబర్దస్త్ లో తన కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తూ. మంచి కామెడీ టైమింగ్ లో.. పంచులు వేయడంలో తన తర్వాతే ఎవరైనా అనేంతగా పేరు దక్కించుకున్నారు.

తన పంచ్ లను ఇంటి పేరుగా మార్చుకొని పంచ్ ప్రసాద్ అయిపోయిన ఈయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఈయనకు రెండు కిడ్నీలు కూడా డామేజ్ అయ్యాయి. ఈ కారణంగానే ఇప్పటికే రెండుసార్లు ఆయన జబర్దస్త్ షో ని వీడి వెళ్లడం జరిగింది. అంతే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా ఆయన రావడం లేదు. ఇటీవల మరొక సారి ఆసుపత్రి పాలయ్యారు. దీంతో కిడ్నీలు ట్రాన్స్లేషన్ చేయించుకోవాలని వైద్యులు చెప్పడంతో ఏపీ జగన్ ప్రభుత్వం సహాయాన్ని అందివ్వగా ఆపరేషన్ కూడా విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉంటున్నారు.

ఇదిలా ఉండగా ఎవరు ఊహించిన విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసారు. ఆపరేషన్ జరిగిన రెండు నెలలకే మళ్ళీ షో లో చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తన అనుభవాలను , బాధలను కూడా పంచుకున్నారు. ఇక అశ్వద్ధామ 3.0 కం బ్యాక్ అంటూ తనదైన స్టైల్ లో డైలాగులు చెబుతూ రీయంట్రీ ఇచ్చారు. షో లో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీ మిస్ కావడం ఇన్నాళ్లు ఇంట్లో ఉండడం ఎలా ఉందని.. అనుభవాలను పంచుకోవాలని.. హైపర్ ఆది అడగగా.. దీనికి పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆపరేషన్ తర్వాత డాక్టర్లు 6 నెలలు కనీసం బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. కానీ నేనే త్వరగా వచ్చాను.

- Advertisement -

ఆర్థిక ఇబ్బందుల కారణంగా తప్పని పరిస్థితుల్లో రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది అని తెలిపారు. మొత్తానికైతే ఆర్థిక ఇబ్బందుల్లో తప్పని పరిస్థితుల వల్ల ఆయన మళ్లీ రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కనీసం ఇప్పుడైనా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం కుదుటపడి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు