Aadikeshava: శ్రీలీల అడ్డంగా బుక్ అయ్యింది… కానీ వరుణ్ హీరోయిన్ గట్టెక్కింది

రీసెంట్ గా వచ్చిన “ఆదికేశవ” మూవీ ఫస్ట్ డే నుంచే నెగిటివ్ టాక్ తో డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా కాంపౌండ్ హీరో పంజా వైష్ణో తేజ్ కెరీర్ ను ఇరకాటంలో పడేసింది ఈ మూవీ. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల రేసులో వరుస హిట్లతో దూసుకెళ్తున్న శ్రీలీల స్పీడుకు “ఆదికేశవ” మూవీ బ్రేక్ వేసింది. ధమాకా, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది శ్రీలీల. ఇక అదే జోష్ తో తన నెక్స్ట్ సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. ఒకవేళ “ఆదికేశవ” మూవీ గనుక హిట్ అయ్యి ఉంటే, శ్రీలీలకు హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఘనత దక్కేది. అలాగే ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ అంటూ టాలీవుడ్ సైతం నెత్తిన పెట్టుకునేది. అలాగే వైష్ణవ్ తేజ్ ఖాతాలో ఓ హిట్ పడేది.

కానీ అందరూ ఊహించినట్టుగానే “ఆదికేశవ” మూవీ ఫ్లాప్ అయ్యింది. మెగా అభిమానులు సైతం ఈ మూవీపై ఆసక్తిని కనబరచలేదు. విమర్శకులు కూడా పెదవి విరిచారు. అయితే ‘ఆదికేశవ’ మూవీ ప్లాఫ్ అవ్వడం చూసిన ఆమె అభిమానులు శ్రీలీల ఈ సినిమాలో నటించకుండా ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు. అయితే నిజానికి ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా వేరే అమ్మాయిని అనుకున్నారట. కానీ శ్రీలీల బ్యాడ్ టైం వల్ల ఈ మూవీ ఒప్పేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ మూవీ పరాజయం వల్ల శ్రీలీలకు నష్టమేం లేదు. ప్రస్తుతం ఆమె చేతులో పలు భారీ ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే..

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ‘ఏజెంట్’ మూవీతో సాక్షి వైద్య అనే అమ్మాయి టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. ‘ఆదికేశవ’ మూవీకి కూడా ఆ అమ్మాయినే ముందుగా హీరోయిన్ గా అనుకున్నారట. కానీ అప్పటికే ఆమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డిజాస్టర్ మూవీ “గాంధీవదారి అర్జున” అనే సినిమాకు సైన్ చేసిందట. ఆమె కాల్షీట్లు “ఆదికేశవ” మూవీ షెడ్యూల్ కు సరిపోకపోవడంతో రిజెక్ట్ చేసింది. ఇక మేకర్స్ చేసేదిలేక అప్పటికే తమ బ్యానర్లో “గుంటూరు కారం” మూవీకి సైన్ చేసిన శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకున్నారు. అలా “ఆదికేశవ” లాంటి భారీ డిజాస్టర్ నుంచి సాక్షి ఎస్కేప్ అయింది. కానీ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల మాత్రం ఇలా అడ్డంగా బుక్కయింది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు