Biggboss Elimination: బయటికి రాక తప్పదని తెలిసినా.. మరింత దిగజారింది..

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. మొదటగా శనివారం రోజు అశ్విని ఎలిమినేట్ అవగా, ఆ తర్వాత ఆదివారం రోజు రతిక ఎలిమినేట్ అయింది. అయితే ఈ వారం వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ ముందే గెస్ చేసారు. ఇక అశ్విని ఎలిమినేట్ అయ్యాక మారు మాట్లాడకుండా బయటికి వచ్చేసింది. ఆ తర్వాత రెండో ఎలిమినేషన్ అర్జున్ రతిక మధ్య జరగగా, ఎలిమినేషన్ ముందు రతిక తనని సేవ్ చేయమని ప్రశాంత్ ని అడిగింది.

ఎందుకంటే ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ గెలిచాడు కాబట్టి, అది ఉపయోగించి ఎవర్నైనా సేవ్ చేయొచ్చు. అది తెలిసి రతిక పాత గొడవలన్నీ మర్చిపోయి ప్రశాంత్ ని సేవ్ చేయమని అడగడం ఆడియన్స్ కి బొత్తిగా నచ్చలేదు. వీళ్ళ మధ్య హౌస్ లో ఎన్ని గొడవలు అయ్యాయో తెలిసిందే. పైగా రతిక ఓ సారి ఎలిమినేట్ అయ్యి, లక్కీ గా మళ్ళీ హౌస్ లో రీ ఎంట్రీ ఇవ్వగా, బయట అన్ని తెలుసుకొని వచ్చి సేఫ్ గేమ్ ఆడడం మొదలెట్టింది. అప్పుడే నాగార్జున వార్నింగ్ ఇచ్చి మరీ సేఫ్ గేమ్ ఆడకుండా, తన ఆట తనని ఆడమన్నాడు.

అయినా సరే రతిక లో ఏ మార్పు రాకపోగా, ఫిజికల్ టాస్కుల్లో చాలా లేజీనెస్ గా వ్యవహరించింది. అందుకే ఆడియన్స్ కూడా సపోర్ట్ చేయలేదు. అయితే తన ఆత్మభిమానం కూడా పక్కన బెట్టి సేవ్ అవడం కోసం రతిక ప్రశాంత్ ని అడుక్కోవడం, రతిక ని సపోర్ట్ చేసే ఉన్న కొద్దీ మందికి కూడా నచ్చలేదు. ఏది ఏమైనా ప్రశాంత్ ఎవిక్షన్ టాస్క్ ని చివరి వారం మాత్రమే వాడతానని చెప్పడంతో నాగార్జున తన ఇష్టం అన్నాడు. ఇక రతిక అశ్విని లా బిహేవ్ చేయకుండా ప్రశాంత్ సహా అందర్నీ విష్ చేసి బయటికి వచ్చింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు