Nani – Srikanth: మళ్ళీ నానినే దిక్కయ్యాడు… వంద కోట్ల డైరెక్టర్ ను ఎవరూ పట్టించుకోలేదా?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్ లోనే బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు. తన గత చిత్రం ‘దసరా’తో సంచలన విజయాన్ని అందుకున్న నాని ఇప్పుడు ‘హాయ్ నాన్న’ అనే సాఫ్ట్ కార్నర్ మూవీతో ప్రేక్షకులను ఎమోషనల్ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నాని కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న “హాయ్ నాన్న” మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. కాగా నాని 31వ సినిమా కూడా ఇప్పటికే సెట్స్ పై ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ మూవీకి “సరిపోదా శనివారం” అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేశారు.

వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్లో గతంలో “అంటే సుందరానికి” అనే మూవీ వచ్చింది. ప్రస్తుతం “సరిపోదా శనివారం” మూవీ షూటింగ్ దశలో ఉండగా, నాని చేయబోయే నెక్స్ట్ మూవీ ఏంటి అనే విషయంపై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘దసరా’ కాంబో రిపీట్ కాబోతోందట. కొత్త దర్శకుడు అయిన శ్రీకాంత్ ఓదెలతో నాని ‘దసరా’ అనే డార్క్ థీమ్ ను తీసుకుని రిస్క్ చేశాడు.

కానీ ఆ సినిమాతో వచ్చిన ఫలితం ఈ నేచురల్ స్టార్ లో ఫుల్ జోష్ నింపేసింది. నాని 15 ఏళ్ల కెరీర్లో ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అదే మొదటిసారి. అంతేకాకుండా నానిని 100 కోట్ల క్లబ్ హీరోల లిస్టులో చేర్చింది ‘దసరా’. పైగా ఆ సినిమా ప్రమోషన్స్ లోనే డైరెక్టర్ శ్రీకాంత్ పనితత్వంపై నాని ప్రశంసలు కురిపించాడు. అయితే మొత్తానికి మరోసారి ఈ కాంబో రిపీట్ కానుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ కు తెర లేపింది. అయితే నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో రిపీట్ అవుతుందంటూ చాలా కాలం నుంచి టాక్ నడుస్తోంది.

- Advertisement -

కానీ సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ‘హాయ్ నాన్న’ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. “సరిపోదా శనివారం” మూవీని పూర్తి చేసి శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టును నాని పట్టా లెక్కించనున్నాడట.

అయితే ఇప్పటికే ఆయన లిస్టులో ఉన్న ‘హిట్’ సీక్వెల్ స్టార్ట్ కావడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ‘దసరా’ కాంబో రిపీట్ అంటూ టాలీవుడ్లో ప్రచారం జరుగుతుండగా, ఈ 100 కోట్ల డైరెక్టర్ ను ఎవరూ పట్టించుకోలేదా? మళ్లీ నానినే దిక్కయ్యాడు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ‘దసరా’ వంటి అద్భుతమైన సినిమాను అందించిన శ్రీకాంత్ ఓదెలపై ఇతర స్టార్ హీరోల దృష్టిలో పడకపోవడం విచిత్రమే మరి.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు