Nani : నేచురల్ గానే అందరినీ గెలికేసాడుగా !

దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని “హాయ్ నాన్న” అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. నాని కెరీర్ లో ఇది 30వ సినిమా కాగా ఇందులో హాట్ అండ్ బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న “హాయ్ నాన్న” మూవీ డిసెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లోనే టీం మొత్తం బిజీగా ఉన్నారు. అందులో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో నాని అందరినీ గెలిచేసాడు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఎలక్షన్స్, ఎలక్షన్స్ మేనిఫెస్టో, మీడియా, సినిమా టికెట్ రేట్స్, వరల్డ్ కప్… ఇలా దేన్నీ వదిలి పెట్టకుండా అందరినీ ఓ రేంజ్ లో ట్రోల్ చేశాడు.

తెలంగాణలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రస్తుతం ప్రజలందరి దృష్టి రాజకీయాలపైనే ఉంది. అయితే ఈ పరిస్థితిని నాని తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకునే ప్రయత్నం చేశాడు. దానికి తగ్గట్టుగానే పొలిటికల్ లీడర్ గెటప్ లోకి మారి, ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

అందులో ముందుగా పలు మీడియా ఛానళ్ల పేరును ప్రస్తావించి, ‘వాడేడి రాలేదా? వాడికి మా పార్టీ అంటే చాలు…’ అంటూ బ్లూ మీడియాను ర్యాగింగ్ చేసే నారా లోకేష్ స్టైల్‌ని అనుకరించే ప్రయత్నం చేశాడు. నాని తన పార్టీ పేరును “హాయ్ నాన్నా” అని ప్రకటించి, మేనిఫెస్టోను విడుదల చేశాడు.

- Advertisement -

‘మేము గనక అధికారంలోకి వస్తే అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం… థియేటర్ల ఆదాయం, అలాగే ఆ పక్కనున్న కిరాణా కొట్టు వాళ్ళ ఆదాయం కూడా… ఇక సబ్జెక్టు, టాపిక్కు తెలియకుండా అదే పట్టుకుని వేలాడుతూ, ఇష్టం వచ్చినట్టు వాగేవారి ఆదాయం కూడా” అంటూ మరోవైపు గతంలో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో చేసిన హంగామాను టార్గెట్ చేశాడు. ‘కిరాణా కొట్టు’ అంటూ నొక్కి మరీ చెప్తూ ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ టిక్కెట్ ధరలపై నాని ఆందోళన వ్యక్తం చేసినప్పుడు తనను ట్రోల్ చేసిన వైసిపి లీడర్స్ కు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేశాడు.

ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. నాని తన సినిమా ప్రమోషన్స్ కోసం దీన్ని కూడా వాడేసుకున్నాడు. తన మేనిఫెస్టోలో వరల్డ్ కప్ ఫైనల్ కి టికెట్ డిస్కౌంట్లు వేయిస్తాం అని చెప్పుకొచ్చాడు. ‘సర్ వరల్డ్ కప్ అయిపొయింది అని ఎవరో అనగా, ‘నెక్స్ట్ వరల్డ్ కప్ కి’ అంటూ సెటైర్ చేశాడు.

అలాగే తండ్రి, కూతుర్ల సినిమా కదా, అందుకే తండ్రికి, కూతుర్లకు రెండు ఓట్ల చొప్పున ఇస్తాం అంటూ ఆయన వ్యాఖ్యానించిన తీరు దొంగ ఓట్లపై ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేసినట్టుగా ఉంది. మరోవైపు తెలంగాణ రాజకీయ నాయకుల్ని, ఇక్కడి పాలిటిక్స్ ను కూడా వదల్లేదు.

మరోవైపు టాప్ మీడియా చానెళ్లకు కూడా ఇచ్చి పడేశాడు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం, సినిమా వాళ్ళు తమ సినిమాల కోసం ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తారు. కానీ మంది రాజకీయనాయకుడికే ఓట్లు వేయండి. మంచి సినిమాను థియేటర్లో చూడండి” అంటూ అందరినీ గెలికేసాడు. మరి నాని కౌంటర్లు సినిమాకు ప్రమోషనల్ గా ఎంత వరకు యూజ్ అవుతాయో గానీ, పాలిటిక్స్ పరంగా మాత్రం బాగా హీట్ పెంచేసాయి.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు