Rashmee: శీతాకాలంలో కూడా సెగలు పుట్టిస్తున్న రష్మీ..ఫొటోస్ వైరల్..!

ప్రముఖ బుల్లితెర గ్లామర్ బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అక్కడ తనలోని హాట్ అందాలను బయటకు ప్రదర్శిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె బుల్లితెరపై సక్సెస్ అయినంతగా వెండితెరపై సక్సెస్ కాలేకపోతోంది. సిల్వర్ స్క్రీన్ మీద సరైన విజయం కోసం ఎంతో ప్రయత్నం చేస్తుంది.

అంతేకాదు అప్పట్లో ఏ సినిమా పడితే ఆ సినిమాలో నటించింది. కానీ ఆ తర్వాత సెలెక్టెడ్ గా పాత్రలను ఎంచుకుంటూ వస్తోంది. అయినా సరే అవకాశం లభించడం లేదు. దీంతో పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా తన ఫోకస్ మొత్తం బుల్లితెర ప్రోగ్రాంల పైనే పెట్టినట్లు తెలుస్తోంది. మరొకవైపు సుధీర్ ,

రష్మీ ట్రాక్ గురించి కూడా జనాలు మాట్లాడుకోవడం ఇప్పుడు పూర్తిగా తగ్గించేశారు. ఒకప్పుడు బుల్లితెరపై ఇదే హాట్ టాపిక్ గా ఉండేది. సుదీర్ తెరపై హీరో అంటూ బిజీగా మారిపోవడంతో రష్మి, సుధీర్ టాపిక్ ను కూడా బుల్లితెర ప్రేక్షకులు పూర్తిగా మర్చిపోతున్నారని చెప్పాలి.

- Advertisement -

ఇదిలా ఉండగా మరొకవైపు రష్మీ , సుధీర్ జోడి కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా తీయాలని కూడా చాలామంది ప్రయత్నించారు. కానీ కథ సెట్ అవ్వడం లేదని.. మంచి కథ దొరికితే తామిద్దరం కలిసి నటిస్తాము అని సుధీర్ కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పటికే పలు ఈవెంట్ లలో, షోలలో ఈ జంటను చూసి మురిసిపోయిన అభిమానులు వెండితెరపై వీరిద్దరూ కలిసి ఆడి పాడితే చూడాలని కూడా అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా రష్మీ కాస్త సమయం దొరికితే చాలు వెకేషన్ లు అంటూ తిరుగుతూ తన స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసింది.

ఈ క్రమంలోనే తాజాగా తన స్నేహితురాలితో కలిసి అండమాన్ లో సందడి చేసింది. ” రాధా నగర్ బీచ్ బాగుందంట.. లవ్ యు ఇండియా” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు అక్కడనుండి తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంది. గ్లామర్ ఫోటోలతో పాటు కొన్ని వీడియోలను కూడా షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు