Hair Growth Tips: హెయిర్ గ్రోత్‌కి సప్లిమెంట్స్ వాడుతున్నారా? అది పెద్ద స్కాం… జాగ్రత్తా..!

బారెడు జుట్టు ఉంటే ఎంత బాగుంటుందో కదా… చాలామంది అమ్మాయిలు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఇక పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారుతుంది. దీంతో ఇంకా టెన్షన్ పడిపోయి, మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. లేదా టీవీ యాడ్స్ లో కనిపించే పలు రకాల హెయిర్ షాంపూలు కూడా వాడతారు. ఇక చాలామంది ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని వాడుకొని, మార్కెట్లో దొరికే పలు రకాల హెయిర్ గ్రోత్ సప్లిమెంట్స్ కొని వాడేస్తుంటారు. సొంత నిర్ణయం తీసుకుని ఉన్న జుట్టుని కాస్త ఊడిపోయేలా చేసుకుంటూ ఉంటారు.

Hair Growth Tips

అయితే హెయిర్ గ్రోత్ సప్లిమెంట్స్ వాడుతున్న జుట్టు ఎందుకు ఊడుతుంది? అనే ప్రశ్న చాలా మందిని కలవర పెడుతూ ఉంటుంది. నిజానికి మన జుట్టును ఆరోగ్యకరంగా చేయాల్సిన విటమిన్ సప్లిమెంట్స్ వాడితే జుట్టు పెరగాలి కదా? మరి ఎందుకు ఊడిపోతున్నట్టు? అని ఎప్పుడైనా ఆలోచించారా. ఒకవేళ ఆలోచించకపోతే ఇప్పటినుంచి ఆలోచించండి. ఉన్న జుట్టు మొత్తం ఊడిపోక ముందే జాగ్రత్త పడండి. మార్కెట్లో హెయిర్ గ్రోత్ కోసం ఎన్నో రకాల సప్లిమెంట్స్ దొరుకుతూ ఉన్నాయి. అయితే ఈ సప్లిమెంట్స్ వాడితే జుట్టు వేగంగా పెరుగుతుంది అంటూ మెడికల్ షాపుల్లో దొరికే ఎన్నో రకాల సప్లిమెంట్స్ స్కాం అని చెప్పాలి.

- Advertisement -

hair-growth-tips-beware-with-using-supplements-for-hair-growth

ఇటీవల బాగా పాపులర్ అయిన హెయిర్ గమ్మిస్ విషయానికి వస్తే… వీటిలో జుట్టు పెరగడానికి హెల్ప్ చేసే బయోటిన్ ఉంటుందని ఆ గమ్మిస్ బాక్స్ పై డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ నిజానికి ఇవి స్వీట్ గా ఉంటాయి. ఎందుకంటే వీటిలో చక్కెర, గ్లూకోజ్ సిరప్, జెలటిన్ వంటి పదార్థాలను కలుపుతారు. చాలావరకు బయట దొరికే హెయిర్ సప్లిమెంట్స్ వల్ల జుట్టు పెరిగే అవకాశం ఉండదు. ఇక మరికొన్ని హెయిర్ సప్లిమెంట్స్ లో బయోటిన్, జింక్, విటమిన్ ఈ వంటి పోషకాలు ఉంటాయి. అయితే నిజంగా ఈ విటమిన్ లోపం ఉంటే తప్ప వాటిని తీసుకోవడం అంత మంచిది కాదు. అలాగే విటమిన్ లోపం లేకపోతే జుట్టు ఎప్పటిలాగే సాధారణంగా పెరుగుతుంది, అంతేకానీ ఎక్కువగా ఏం పెరగదు.

hair-growth-tips-beware-with-using-supplements-for-hair-growth

పైగా అలా తీసుకోవడం వల్ల థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలకు మూలం కావచ్చు. అందుకే ఇలాంటి సప్లిమెంట్లను తీసుకునే ముందు డాక్టర్లను కలవడం మంచిది. డాక్టర్లు మీ సమస్యను తెలుసుకుని, దానికి తగ్గ సప్లిమెంట్స్ ఇస్తారు. దీనివల్ల ఇలా మార్కెట్లో దొరికే అనవసరమైన ప్రొడక్ట్స్ వాడి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉండడంతో పాటు ఆరోగ్యంపై కూడా ఎఫెక్ట్ పడకుండా చూసుకోవచ్చు. అలాగే పనిలో పనిగా మీ సమస్యకు మంచి పరిష్కారం కూడా లభిస్తుంది. కాబట్టి మార్కెట్లో దొరికే హెయిర్ గ్రోత్ సప్లిమెంట్స్ స్కామ్ నుంచి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు