Bhola Shankar: మెహర్ రమేష్ దయ వల్ల ఇండియాకి కప్పు ఖాయం

మెహర్ రమేష్.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంత్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు ఆ తర్వాత చేసిన బిల్లా , శక్తి , షాడో, భోలా శంకర్ సినిమాలు కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. మెహర్ రమేష్ కెరియర్లో ఖచ్చితమైన హిట్ సినిమా అంటే ఇప్పటికే ఎవరూ చెప్పలేరు. మెహర్ రమేష్ టేకింగ్ పరంగా సినిమాని బాగా తెరకెక్కించిన కథ కథనం విషయంలో మాత్రం ఆడియన్స్ ని తికమకు పెట్టడం ఖాయం.

అయితే ఇప్పుడు మెహర్ రమేష్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఇండియా ఫైనల్స్ కి వచ్చింది కాబట్టి. వరల్డ్ కప్ ఫైనల్స్ కి ఇండియా రావడానికి అలానే మెహర్ రమేష్ కి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారు కదా, ఇక్కడే ఉన్న అసలైన మేటర్ ఉంది. 2011లో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన శక్తి సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ఇండియా వరల్డ్ కప్ ను సాధించింది. ఆ తర్వాత 2013 వ సంవత్సరంలో షాడో సినిమా రిలీజ్ అయింది. అప్పుడు కూడా ఇండియా వరల్డ్ కప్ ను సాధించింది.

ఇకపోతే రీసెంట్ గా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన సినిమా భోలాశంకర్. ఈ సినిమా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కూడా ఊహించని డిజాస్టర్ ను చేజిక్కించుకుంది. మెగాస్టార్ ని కమర్షియల్ గా చూపించిన కూడా సినిమా పెద్దగా వర్కౌట్ కాకుండా పోయింది. మెహర్ రమేష్ కి ఈ సినిమా లైఫ్ ఇస్తుంది అనుకున్నారు . కానీ ఈ సినిమా కంప్లీట్ గా మెహర్ ని పాతాళంలోకి తొక్కేసింది.

- Advertisement -

అయితే ఇప్పుడు భోలాశంకర్ కి ఇండియా వరల్డ్ కప్ కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా.? ఇంతకుముందు 2011, 2013లో మెహర్ రమేష్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు ఫెయిల్ అయిన ఇండియా ప్రపంచ కప్ కొట్టింది. ఇప్పుడు కూడా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి కూడా ప్రపంచకప్ మనదే అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. మొదటి రెండు విషయాల్లో నిజమైనది, ఈసారి నిజం కాబోతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని క్షణాలు వేసి చూడక తప్పదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు