Lokesh Kanagaraj: కామెంట్స్ మన్సూర్ అలీ , కానీ లోకేష్ బలి

 లోకేష్ కనకరాజ్ నగరం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులకి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చి టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. తర్వాత చేసిన ఖైదీ సినిమా లోకేష్ కనకరాజ్ ని వేరే లెవెల్లో నిలబెట్టింది.

అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన మాస్టర్ సినిమా కూడా మంచి రిజల్ట్స్ సాధించి లోకేష్ కనకరాజ్ కి మంచి పేరును తీసుకొచ్చింది. అయితే కమలహాసన్ హీరోగా చేసిన విక్రమ్ సినిమా మాత్రం లోకేష్ ని ఒక కొత్త స్థానం తీసుకొచ్చింది. లోకేష్ కనకరాజ్ అనే పేరుని ఒక బ్రాండ్ చేసేసింది.

తెలుగులో కూడా లోకేష్ సినిమా వస్తుందేనంటే క్యూరియాసిటీతో ఆడియన్స్ వెయిట్ చేసే రేంజ్ కి ఎదిగాడు లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ టేకింగ్, ఫ్రెమింగ్, సినిమాను సెట్ చేసే విధానం అన్ని ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచాయి. తెలుగులో మొదటిసారిగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ పరిచయం చేశాడు లోకేష్.

- Advertisement -

లోకేష్ రీసెంట్ గా చేసిన లియో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. అయితే కొందరు మాత్రం ఈ సినిమా సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది అని ఇబ్బందిపడ్డారు.

ఇకపోతే ఈ సినిమాలో మన్సూర్ అలీ కి మంచి పాత్రను రాశాడు లోకేష్ కానక రాజ్. అయితే మన్సూర్ అలీ బయట ఏం మాట్లాడుతాడు తనకే తెలియని విధంగా మాట్లాడుతాడు. రీసెంట్ గా త్రిష పై చేసిన వ్యాఖ్యలపై చాలామంది నెటిజన్లు స్పందించి మన్సూర్ అలీ పైన విరుచుకుపడ్డారు. రీసెంట్ గా ఈ కామెంట్స్ పై త్రిష కూడా తనదైన శైలిలో స్పందించింది. ఇకపోతే హీరో విలన్ కలిసి కమెడియన్ ను చంపేసినట్టు ఈ వ్యవహారం అంతట్లో లోకేష్ కనకరాజ్ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు లోకేష్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది నెటిజెన్స్.

అటువంటి వరస్ట్ క్యాండిట్ ని సినిమాల్లో ఎలా పెట్టుకుంటారు అంటూ లోకేష్ పైన విరుచుకుపడుతున్నారు. ఏదేమైనా తన సినిమాకి ఎటువంటి నటులు పర్ఫెక్ట్ అనుకునేది దర్శకుడు యొక్క ఛాయిస్. అంతేకానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ కి మిగతా వాటికి డైరెక్టర్ కి సంబంధం లేదనేది కొంతమంది నెటిజన్స్ తెలుసుకోవాల్సి ఉంది. ఏదేమైనా అటువంటి వాళ్ళని ఇండస్ట్రీ బ్యాన్ చేయడం కూడా కరెక్ట్ అనేది కొంతమంది ఉద్దేశం

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు