Hi Nanna: ఖర్చుకు తగ్గొద్దు కాసులు కురుస్తాయి.

సౌర్య దర్శకత్వంలో ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా హాయ్ నాన్న.
ఈ సినిమాలో నాని సరసన  మృణాల ఠాకూర్ నటిస్తుంది.  రీసెంట్ గా
ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్,  సాంగ్స్ ఇవన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో నాని చేస్తున్న సినిమాలన్నీ కూడా వేటికవి ప్రత్యేకమని చెప్పొచ్చు.  అందుకే నాని సినిమా అంటే ప్రస్తుతం ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

రీసెంట్ గా చేసిన శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి, దసరా ఈ సినిమాలన్నిటిలో నానిలో ప్రతి సినిమాకి వేరియేషన్స్ కనిపిస్తున్నాయి.  ఇప్పుడు వస్తున్న హాయ్ నాన్న సినిమాలో కూడా నాని చాలా కూల్ గా, క్లాస్ గా కనిపిస్తున్నాడు.  ఈ సినిమాకి “హృదయం” ఫేమ్  అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.  ఇదివరకే రిలీజ్ అయిన పాటలన్నీ మంచి రెస్పాన్స్ ను సాధించాయి. అయితే ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ దాటి వెళుతుందంట. కానీ ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడొద్దు, అని నాని  నిర్మాతలకు ధైర్యం చెబుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇదివరకే నాని శ్యామ్ సింగ రాయ్, దసరా సినిమాలకు కూడా ఇలానే హోప్ ఇస్తూ సినిమా ప్రోడక్ట్ ని బయటికి తీసుకొచ్చాడు. అయితే కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. ఇదే ప్రశ్నను ఒక ప్రముఖ జర్నలిస్ట్ అడిగినప్పుడు కూడా క్లారిటీగా సమాధానం ఇచ్చాడు నాని.  అలానే ఆయా సినిమాలో ప్రొడ్యూసర్స్ కూడా ఆ మాటలకు రియాక్ట్ అయ్యారు.  ఒక మంచి కథ బాగుండి, ఆ మంచి కథను సినిమా ద్వారా  జనాల్లోకి తీసుకెళ్లాలంటే, ఆ సినిమాని వెండితెరపై ఆవిష్కరించాలంటే కొన్నిసార్లు ఖర్చుకు వెనకాడకూడదు అని నాని కూడా ఒక క్లారిటీ ఉంది.

- Advertisement -

నాని కూడా ప్రముఖ దర్శకుడు బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి వచ్చాడు కాబట్టి ఒక సినిమాకి ఎంత అవసరమో కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది.  ఈరోజు నాని సక్సెస్ రేట్ లో ఉండి ఇంతవరకు నిలబడడానికి కారణం కూడా ఆ క్లారిటీ ఉండటం, డైరెక్టర్ విజన్ ను అర్ధం చేసుకోవడం  అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు