Sai Pallavi: అతని కోసం రూల్స్ బ్రేక్ చేస్తున్న సాయి పల్లవి.. అందుకేనా..?

లేడీ పవర్ స్టార్ గా పేరు దక్కించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలయాళం ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగులో ఫిదా సినిమా ద్వారా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను తన న్యాచురల్ నటనతో ఫిదా చేసేసింది. ఇకపోతే ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎలాంటి సినిమాలు చేశాము.. ఎంత గుర్తింపు తెచ్చుకున్నాము.. అనేది ముఖ్యం అంటూ అదే దిశగా అడుగులు వేస్తున్న సాయి పల్లవి.. సాధ్యమైనంత వరకు సెలెక్టెడ్ పాత్రలు ఎంచుకుంటూ మంచి విజయాలు తన ఖాతాలో వేసుకుంటుంది.

ఇక హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఫిదా సినిమా తర్వాత దాదాపు 30 సినిమాలలో ఆఫర్లు లభించినా చాలా తక్కువ ఆఫర్స్ కి మాత్రమే ఆమె ఓకే చేసింది. ఇకపోతే తన నటనతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ విషయంలో కూడా కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఉంటుంది. ఆరేళ్ల కెరియర్ లోనే ఇప్పటివరకు వాటిని ఎప్పుడు క్రాస్ చేయలేదు..ఇక ఆ రూల్స్ ఏమిటా అనే విషయానికి వస్తే.. మొదటిది గ్లామర్ షో చేయడానికి ససేమీరా అంటుంది..

రెండోది క్యారెక్టర్.. కోట్లు ఇచ్చినా సరే కథ నచ్చకపోతే అవతల ఎంత పెద్ద హీరో, డైరెక్టర్ అయినా సరే మొహం మీదే చెప్పేయడం ఆమె స్టైల్ .. అందుకే డియర్ కామ్రేడ్, భోళా శంకర్ వంటి సినిమాలకు కూడా నో చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తెలుగులో ఇప్పటివరకు ఏ ఒక్క స్టార్ హీరోతో కూడా కలిసి నటించలేదు. ఇక గ్లామర్ షో కి దూరంగా ఉండే సాయి పల్లవి వైపు మన స్టార్ హీరోలు కూడా చూడలేదని చెప్పాలి.

- Advertisement -

అలాంటి ఈమెకు తాజాగా రాంచరణ్ సరసన నటించే అవకాశం లభించింది . పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో బుచ్చిబాబు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది మైత్రి మూవీ మేకర్స్, వృద్ధిస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఆర్సి 16 సినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథతోనే ఈ సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్ పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందట.

రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ అయితే ఈ పాత్ర భారం మోయడం కష్టమని అందుకే సాయి పల్లవిని ఆయన తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు పై నమ్మకం ఏర్పడిన సాయి పల్లవి అతడి కోసం తన రూల్స్ ని కూడా పక్కనపెట్టి ఈ సినిమా కోసం ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు