Sai Pallavi: చిట్టిబాబు కి భలే కాంబినేషన్ సెట్ చేసిన బుచ్చిబాబు

ఫిదా సినిమాతో తెలుగులో హీరోహిన్ గా ఇంటి ఇచ్చింది సాయి పల్లవి. సాయి పల్లవి ఫిదా తర్వాత కొన్ని సినిమాలు చేసిన కూడా సరైన హిట్ పడలేదు. కానీ సినిమాలు ఫెయిల్ అయిన కూడా సాయి పల్లవి ఎక్కడ ఫెయిల్ కాలేదు. తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. ఇప్పటికీ సాయి పల్లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా తర్వాత చేసిన మిడిల్ క్లాస్ అబ్బాయి, శర్వానంద్ సరసన చేసిన పడి పడి లేచే మనసు సినిమాలు అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోయినా సాయి పల్లకి అవకాశాలు మాత్రం తగ్గలేదు.

నాని సరసన చేసిన శ్యామ్ సింగ రాయ్ సినిమా సాయి పల్లకి మంచి పేరును తీసుకొచ్చింది. అలానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా సాయి పల్లకి మంచి హిట్ అందించింది. రానాతో చేసిన విరాటపర్వం సినిమా కమర్షియల్ గా థియేటర్ వద్ద హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి రామ్ చరణ్ సరసన నటించే అవకాశం దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఉప్పెన సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు బుచ్చిబాబు సాన. తన మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్కెట్లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత చాలా ఏళ్లు ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది అని వెయిట్ చేశాడు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా పట్టాలకు ఎక్కలేదు. ప్రస్తుతం బుచ్చిబాబు సాన రామ్ చరణ్ తో సినిమాను చేస్తున్నాడు. గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది.

- Advertisement -

అయితే ఈ సినిమాలో చరణ్ సాయి పల్లవి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటిసారి సాయి పల్లవి చరణ్ సరసన నటిస్తుంది. ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇకపోతే రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు డాన్స్ లో తోపు కాబట్టి ఈ కాంబినేషన్ లో ఒక మాస్ బీట్ పడితే థియేటర్స్ లో ఆడియన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు