Gaami First day Collections: గామి కలెక్షన్లు గట్టిగానే ఉన్నాయి… కానీ, ముందున్న సవాల్ ఇదే

తెలుగు ఆడియన్స్ ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలపై ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ, సినిమా ఫైనల్ అవుట్ పుట్ లో ఎలాంటి మైనస్ ఉన్నా.. హీరో, డైరెక్టర్ లకు ఎదుర్కొనే ట్రోల్స్ మాత్రం అంతా ఇంత కాదు. అందుకే చాలా వరకు డైరెక్టర్లు ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ కి దూరంగా ఉంటారు. ఇప్పటి వరకు ఆడియన్స్ ఒకే చేసిన కథలనే కాస్త అటు ఇటు మార్పులు చేసి సినిమాలు చేసేస్తారు. ప్రస్తుతం వచ్చే సినిమాలన్నీ కూడా అదే కోవాకి చెందినవి.

ఇప్పుడు విశ్వక్ సేన్ నుంచి ఓ మూవీ వచ్చింది. అదే గామి. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి వస్తున్న మాట… ‘డైరెక్టర్ తీసుకున్న కొత్త కాన్సెప్ట్ కి మంచి మార్కులు వేయాల్సిందే’ అలాగే ఈ కొత్త కాన్సెప్ట్ ను తెరకెక్కించడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని విశ్లేషకులు చెబుతున్నారు. అంతే కాదు, విశ్వక్ సేన్ కు కూడా ఫర్మామెన్స్ కి మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఇలాంటి మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ఎలా ఫర్మామ్ చేసిందో ఇప్పుడు చూద్దాం…

ఫస్ట్ డే కలెక్షన్లు…
సినిమా మార్చి 8న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అదే రోజున గోపిచంద్ నటించిన భీమా మూవీ కూడా థియేటర్స్ లోకి వచ్చింది. భీమా ట్రైలర్ గానీ, ప్రమోషనల్ కంటెంట్ గానీ చూస్తే ఆడియన్స్ లో ఓ రకమైన ఇంట్రెస్ట్ కలిగింది అనేది నిజం. ఇది గామి మూవీ టీంకి ఓ టెన్షన్ ఉండేది. కానీ, భీమా ఫస్ట్ షో చూసిన తర్వాత తమ సినిమాకు పోటీ వచ్చే ఛాన్స్ లేదని ఫిక్స్ అయ్యారు గామి టీం.

- Advertisement -

గామి సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 9.07 కోట్ల గ్రాస్ ను సాధించింది. దీనికి సంబంధించిన అధికారిక పొస్టర్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. విశ్వక్ సేన్ మూవీకి ఫస్ట్ డే 9 కోట్ల గ్రాస్ అంటే ఒక రకంగా మంచి పరిణామమే అనుకోవచ్చు. ఇది ఈ యంగ్ హీరో కెరీర్ లోనే హైయేస్ట్ ఓపెనింగ్స్. అంతే కాదు… ఫస్ట్ డే నే మూవీ దాదాపు 50 శాతానికి పైకి బిజినెస్ ను రిటర్న్ చేసుకుంది.

నైజం & సీడెడ్‌ స్ట్రాంగ్‌గా …

విశ్వక్ సేన్ అన్ని సినిమాలను కాస్త గమనిస్తే నైజం ఏరియాలో మంచి పట్టు ఉందని తెలిసిపోతుంది. ఇప్పుడు గామి సినిమాతో ఇది మరోసారి ప్రూవ్ అయింది. నైజం ఏరియాలో గామి సినిమా 1.45 కోట్ల షేర్ ను వసూళ్లు చేసింది. ఇక సీడెడ్ లో కూడా మంచి ఫర్మామెన్స్ ఇస్తుంది. ఈ సినిమా సీడెడ్ ‌లో ఫస్ట్ డే 55 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

ముందున్న సవాల్ ఇదే…

గామి సినిమాకు ఇప్పటి వరకు మంచి టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఫస్ట్ డే నే 50 శాతం వరకు బిజినెస్ ను రిటర్న్ చేసుకుంది. శివరాత్రి సెలవు దినం గామికి బాగా హెల్ప్ అయింది. శని, ఆది వారం కూడా ఇదే టాక్ ఉంటుంది కాబట్టి కలెక్షన్లకు డోక లేదు. కానీ, వీక్ డేస్‌‌లో గానీ, శని, ఆదివారాల్లో గానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాకు ఉన్న మైనస్ లలో సెన్సార్ సర్టిఫికేట్ ఒకటి. A సర్టిఫికేట్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు రావడానికి వెనకడుగు వేస్తున్నారు. మరి కొంత మంది A సర్టిఫికేట్ మూవీ కాబట్టి… థియేటర్ లోకి పిల్లలను తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనే ఆలోచనతో థియేటర్స్ కు రావడం లేదు. ఇది సినిమా కలెక్షన్ల పై భారీగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఈ ఒక్క సవాల్ ను గామి సరిగ్గా మ్యానేజ్ చేయకలిగితే… సినిమాకు మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు