Gaami: “గామి”కి నెగెటివ్ రివ్యూలు, దారుణమైన రేటింగ్స్

యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త మూవీపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారా? మొదటిసారి ఈ హీరో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన “గామి” మూవీపై ఎవరికి అంత కోపం ఉంది? అసలు “గామి”పై నెగెటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇదొక రకమైన ప్రచారమా? అనే వివరాల్లోకి వెళ్తే…

నెగిటివ్ సెగ…
విద్యాధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందిన మూవీ “గామి”. కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ మూవీలో అభినయ, దయానంద్ రెడ్డి, హారిక, మహమ్మద్ సమద్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ మార్చ్ 8న మహా శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఇందులో మొదటిసారి విశ్వక్ అఘోరాగా నటించారు. ట్రైలర్ తోనే హైప్ పెంచేసిన “గామీ”కి ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ దక్కాయి. టాలీవుడ్ నుంచి ఎట్టకేలకు డిఫరెంట్ కంటెంట్ మూవీ వచ్చింది అని ఒక వర్గం ప్రేక్షకులు ఆనందిస్తుంటే మరోవైపు ఈ మూవీకి నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి అనే వార్తలు సంచలనంగా మారాయి. టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో వస్తున్న నెగెటివ్ రివ్యూలు ప్రేక్షకులపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటున్నారు.

బోట్ అకౌంట్స్ తో దారుణం…
బుక్ మై షో యాప్ లో వస్తున్న రివ్యూలను బట్టి కొంతమంది ప్రేక్షకులు సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు అదే శాపం అవుతోంది అంటున్నారు పలువురు మూవీ మేకర్స్. తాజాగా గామి మూవీ విషయంలో కావాలనే కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మరీ 1 స్టార్ రేటింగ్ ను ఇస్తున్నాయని అంటున్నారు. దీనివల్ల బుక్ మై షోలో ఈ సినిమాకు కేవలం 8.3 రేటింగ్ మాత్రమే వచ్చింది. కావాలనే ఇలా బుక్ మై షోలో బోట్ అకౌంట్స్ తో దారుణమైన రేటింగ్స్ ఇచ్చి సినిమాలపై నెగెటివిటిని పెంచి, ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేస్తున్నాయని కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇది కూడా ఒక రకమైన పబ్లిసిటీనేనా ?
అయితే ఫేక్ అకౌంట్స్ తో నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారు అనేది అన్ని సినిమాలకు నిజం కాకపోవచ్చు. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ ఖుషి, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలకు బుక్ మై షోలో ఇలాంటి సమస్య ఎదురయింది. దీంతో ఆ రెండు సినిమాల నిర్మాతలు సీరియస్ అయ్యారు. చట్టపరమైన చర్యలకు సిద్ధమై బుక్ మై షోకు నోటీసులు కూడా జారీ చేశారు. వాళ్ల విషయంలో నిజంగా జరిగింది కాబట్టి దాన్ని ప్రూఫ్స్ తో సహా బయట పెట్టి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి గామి మూవీకి కూడా అదే సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. కానీ నిజానికి ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఈ మూవీపై హైప్ గట్టిగానే ఉంది. అలాంటిది “గామి”పై నెగటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? సినిమాపై రిలీజ్ కి ముందు భారీ అంచనాలే ఉన్నప్పటికీ థియేటర్లలోకి వచ్చాక మాత్రం యావరేజ్ టాక్ నడుస్తోంది. మరి ఒక యావరేజ్ మూవీకి ఎవరైనా ఎందుకు నెగిటివ్ ప్రచారం చేస్తారు? అని అంటున్నారు నెటిజన్లు. మరి ఈ విషయంలో గామి టీం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు