Hansika: ఆ క్షణం నన్ను చూసి నేనే భయపడ్డా..!

హన్సిక మోత్వాని.. పాలపిట్టలా.. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందంతో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించి మంచి పేరు దక్కించుకుంది.. ఇటీవల వివాహం చేసుకున్న హన్సిక వివాహనంతరం కథానాయికగా బిజీగా ఉన్న అతి కొద్ది మంది నటీమణులలో ఒకరిగా నిలిచింది. బహుభాషా నటి అయిన ఈమె నటించిన చిత్రాలు ఇప్పుడు వరుసగా తెరపైకి వస్తున్నాయి.. అలా తాజాగా ఈమె నటించిన చిత్రం గార్డియన్.. హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో హన్సిక ఒక అందమైన యువతిగా మరొకవైపు అందరినీ భయపెట్టే దెయ్యం గా ద్విపాత్రాభినయం చేసింది..

గార్డియన్ సినిమాపై అనుభవం..
ఫిలిం వర్క్స్ పతాకం పై విజయ్ చందర్ నిర్మించిన ఈ సినిమాకి దర్శక ద్వయం శబరి , గురు శరవణన్ దర్శకత్వం వహించారు.. ఉమెన్స్ డే సందర్భంగా నిన్న తెరపైకి వచ్చింది.. అరణ్మణై 1,2 సినిమాల తర్వాత హన్సిక నటించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు రావడంతో తన అనుభవం గురించి వెల్లడించింది.. ఈ సినిమా చేసేటప్పుడు తాను అనుభవించిన అనుభవాల గురించి మాట్లాడుతూ గార్డియన్ చిత్రంలో నటించడం ఒక సరికొత్త అనుభవంగా నిలిచింది.. ఈ సినిమాలో దెయ్యం పాత్ర కోసం ప్రత్యేకంగా నటించాను .. ముఖ్యంగా ఈ పాత్ర గెటప్ చాలా ప్రత్యేకంగా ఉంది.. ఇందుకోసం స్పెషల్ లెన్స్ కూడా పెట్టుకున్నాను అంటూ వెల్లడించింది..

నేనే భయపడ్డా..
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను స్మశానంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో చిత్రీకరించారు.. అది కూడా తలకిందులుగా వేలాడుతూ .. దెయ్యంగా అరిచే సన్నివేశాలలో నటించడం అతి పెద్ద సవాలుగా మారింది.. అయితే ఆ సమయంలో దెయ్యం గెటప్ లో ఉన్న నన్ను చూసి నేనే భయపడ్డాను.. అది ఒక గొప్ప అనుభవం అంటూ హన్సిక చెప్పుకొచ్చింది..

- Advertisement -

పెళ్లికి ముందు పెళ్లి తర్వాత..
ఇకపోతే పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత తేడా ఏమైనా ఉందా? అని ఇంటర్వ్యూలో అడగగా.. హన్సిక మాట్లాడుతూ వివాహం తర్వాత నటించినప్పటికీ కూడా తనకు ఎలాంటి వ్యత్యాసం అనిపించడం లేదని తెలిపింది.. అంతేకాదు ఎప్పటిలాగే తన తల్లి , భర్త మద్దతుగా నిలుస్తున్నారని.. అందుకే తనకు ఎలాంటి వ్యత్యాసాలు కనిపించడం లేదు అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ..

హన్సిక నటిస్తున్న చిత్రాలు..
ప్రస్తుతం ఈమె నటించిన గార్డియన్ చిత్రం విడుదల కాగా త్వరలో మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలోని ఈమె నటిస్తున్న గాంధారి , ది మెన్ చిత్రాలు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. మొత్తానికైతే పెళ్లికి ముందు వరుస సినిమాలు చేసి ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని వివాహం తర్వాత మళ్లీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన హన్సిక టాలెంట్ కి అందరూ ఫీదా అవుతున్నారు. ఏది ఏమైనా వివాహం తర్వాత కూడా అదే జోష్లో దూసుకుపోవడం అనేది మామూలు విషయం కాదని చెప్పవచ్చు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు